Dunki : డుంకీ ఫట్ అవుతుందా? అందుకే హిందీ కి లిమిట్ చేశార?

పఠాన్‌.. జవాన్ బ్లాక్‌బస్టర్స్‌తో వచ్చిన క్రేజ్‌ను షారూక్‌ ఖాన్‌ ఎందుకు యూజ్‌ చేసుకోవడం లేదు? వరుస రెండు వెయ్యి కోట్ల సినిమాలతో పాన్‌ ఇండియా వైడ్‌ క్రేజ్‌ వచ్చినా.. డుంకీని ఎందుకు లైట్‌గా తీసుకున్నాడు. డుంకీ ఒక్క హిందీలోనే ఎందుకు రిలీజ్‌ అవుతోంది. చాలా డౌట్ ఉన్నాయి జనానికి. పఠాన్‌.. జవాన్‌ చెరో వెయ్యి కోట్లు కలెక్ట్ చేయగా.. ఈనెల 21న వస్తున్న 'డుంకీ' తో వెయ్యి కోట్లు సంపాదించిన ఒకే ఏడాది మూడు వెయ్యి కోట్ల సినిమాలతో అరుదైన రికార్డ్‌ బాద్షా సొంతం అవుతుందని ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూశారు. దీనికి డుంకీ గండి కొడుతుందా? అన్న భయం మొదలైంది. పఠాన్‌, జవాన్‌ మాదిరి డుంకీ పాన్‌ ఇండియాగా రిలీజ్‌ కాకపోవడమే ఇందుకు కారణం.

పఠాన్‌.. జవాన్ బ్లాక్‌బస్టర్స్‌తో వచ్చిన క్రేజ్‌ను షారూక్‌ ఖాన్‌ ఎందుకు యూజ్‌ చేసుకోవడం లేదు? వరుస రెండు వెయ్యి కోట్ల సినిమాలతో పాన్‌ ఇండియా వైడ్‌ క్రేజ్‌ వచ్చినా.. డుంకీని ఎందుకు లైట్‌గా తీసుకున్నాడు. డుంకీ ఒక్క హిందీలోనే ఎందుకు రిలీజ్‌ అవుతోంది. చాలా డౌట్ ఉన్నాయి జనానికి. పఠాన్‌.. జవాన్‌ చెరో వెయ్యి కోట్లు కలెక్ట్ చేయగా.. ఈనెల 21న వస్తున్న ‘డుంకీ’ తో వెయ్యి కోట్లు సంపాదించిన ఒకే ఏడాది మూడు వెయ్యి కోట్ల సినిమాలతో అరుదైన రికార్డ్‌ బాద్షా సొంతం అవుతుందని ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూశారు. దీనికి డుంకీ గండి కొడుతుందా? అన్న భయం మొదలైంది. పఠాన్‌, జవాన్‌ మాదిరి డుంకీ పాన్‌ ఇండియాగా రిలీజ్‌ కాకపోవడమే ఇందుకు కారణం.

Pooja Hegde : పూజా హెగ్డే కష్టాలు తీరనున్నాయా?

జవాన్‌ తెలుగులో 15 కోట్లు కలెక్ట్ చేస్తే.. పఠాన్‌ 30 కోట్ల షేర్‌ కలెక్ట్‌ చేసింది. తెలుగులో ఎక్కువ కలెక్ట్ చేసిన హిందీ డబ్బింగ్‌ మూవీగా ‘జవాన్‌’ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. గతంలో సల్మాన్‌ మైనే ప్యార్‌ కియా తెలుగులో ప్రేమపావురాలుగా.. షారూక్‌ ‘హమ్‌ ఆప్‌ కే హై కౌన్‌’ ప్రేమించి పెళ్లాడుతాగా రిలీజై హిట్‌ అయ్యాయి. ధూమ్‌ తర్వాత జవాన్‌.. పఠాన్‌ భారీ వసూళ్లు సాధించిన రికార్డ్‌ ఓపెనింగ్స్ సాధించాయి.

పఠాన్‌, జవాన్‌ పాన్‌ ఇండియా మూవీస్‌గా.. సౌత్‌లో ముఖ్యంగా తెలుగు, తమిళంలో రిలీజ్‌ అయ్యాయి. డంకీని ఒక్క హిందీలోనే విడుదల చేస్తున్నారు. పఠాన్‌, జవాన్‌లా డుంకీ యాక్షన్‌ మూవీ కాదని.. అందుకే హిందీకే పరిమితం చేశారన్న టాక్‌ నడుస్తోంది. ఒకసారి పాన్‌ ఇండియా ఇమేజ్‌ వచ్చాక.. ఎలాంటి జానర్‌ మూవీ అయినా.. అన్ని భాషల్లో రిలీజ్‌ చేస్తారు. కానీ.. డుంకీని హిందీలో మాత్రమే రిలీజ్‌ చేయడం సౌత్‌లోని షారూక్‌ ఫ్యాన్స్‌కు నచ్చలేదు.
డుంకీ డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ హిరాణీ కథలు అందరికీ నచ్చుతాయి. మున్నాభాయ్‌ ఎంబిబియస్‌ను తెలుగులో శంకర్‌దాదా ఎంబిబియస్‌ పేరుతో రీమేక్‌ చేస్తే.. సూపర్‌హిట్ అయింది. త్రీ ఇడియట్స్‌ను తమిళంలో నాన్బన్‌గా రీమేక్‌ చేస్తే సక్సెస్‌ అయింది. పాన్‌ఇండియా ట్రెండ్‌ లేని టైంలోనే రాజ్‌కుమార్‌ హిరాణీ స్టోరీస్‌ను ఇండియన్‌ ఆడియన్స్‌ ఆదరించారు. కానీ.. డుంకీని డబ్‌ చేయడపోవడం షాక్‌ ఇస్తోంది.

డుంకీ పాన్‌ ఇండియాగా మూవీగా రిలీజ్‌ కాకపోవడానికి సలార్‌ కూడా ఒక కారణమే. సలార్‌ ట్రైలర్‌ ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్ మూవీగా రూపొందింది. డుంకీ ఏమో సాఫ్ట్‌ అండ్‌ కూల్‌ మూవీ. అన్ని భాషల్లో డుంకీని తీసుకొస్తే.. సలార్‌తో పోల్చి రిజల్ట్‌ డిసైడ్‌ చేస్తాడు. కెజిఎఫ్‌2తో ప్రంశాంత్‌ నీల్‌కు హిందీలో వచ్చిన సూపర్‌క్రేజ్‌ సలార్‌ ఓపెనింగ్స్‌కు యూజ్‌ అవుతోంది. యాక్షన్‌ మూవీతో పోటీ ఎందుకనుకన్నారో ఏమో.. డుంకీని పాన్‌ ఇండియాగా తీసుకురావడానికి మేకర్స్‌ ఇంట్రస్ట్‌ చూపించడం లేదు.

డుంకీ, సలార్‌ ఒక రోజు గ్యాప్‌లో రిలీజ్‌ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు మొదట 22నే రిలీజ్‌ కావాల్సి వుంది. ఎక్కువ థియేటర్స్‌ కోసం.. డుంకీ ఒక రోజు ముందుకు వచ్చేసింది. సలార్‌ ట్రైలర్‌ రిలీజ్‌ కాగానే.. డుంకీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. మున్ముందు ప్రమోషన్‌లో కూడా కాంపిటీషన్‌ నడుస్తుంది. హిందీ ఆడియన్స్‌కు యాక్షన్‌ మూవీ సలార్‌ నచ్చుతుందా? లేదంటే.. ఫ్యామిలీ మూవీ డుంకీకి ఓటేస్తారో చూడాలి మరి.