వయసు 45 ఏళ్ళు… ఇండియన్ సినిమాలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. పాన్ ఇండియా లెవెల్ లో నెంబర్ 1 హీరో. కెరీర్ లో ఇంతకు మించి చూడాల్సిన సక్సెస్ లేదు. కానీ పెళ్లి మాట మాత్రం లేదు. సినిమాలు చేస్తూ హిట్ లు కొడుతున్నాడు అని సంతోష పడాలో… పెళ్లి చేసుకుని… వారసుడ్ని ఫ్యాన్స్ కు పరిచయం చేయడం లేదని బాధ పడాలో ఫ్యాన్స్ కు అర్ధం కావడం లేదు. మరో సల్మాన్ ఖాన్ లా ఎక్కడ మిగిలిపోతాడో అని ఫ్యాన్స్ కు భయం పట్టుకుంది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి అంటున్నారు గాని ఏ అమ్మాయి ఫైనల్ కావడం లేదు.
10 ఏళ్ళ నుంచి ప్రభాస్ పెళ్లి గురించి ఎన్నో వార్తలు. పెళ్లి లేదు బల్లి లేదు… ఎప్పుడు చేసుకుంటాడో చెప్పడు, అసలు చేసుకుంటాడో లేదో చెప్పడు. శెట్టి అని కొన్నాళ్ళు… సనన్ అని మరికొన్నాళ్ళు ఇలా ప్రభాస్ పెళ్లి చేసుకునే అమ్మాయి గురించి ఎన్నో వార్తలు. మరి కొన్నాళ్ళు గోదావరి జిల్లా అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు అనే ప్రచారం. కాదు కాదు… అనుష్క… ప్రభాస్ కోసమే పెళ్లి చేసుకోవడం లేదని మరికొన్నాళ్ళు వార్తలు. కాని ఇప్పటి వరకు కనీసం క్లూ కూడా లేదు. ప్రభాస్ పెళ్లి చూడాలనుకున్న… ఆయన పెదనాన్న కృష్ణం రాజు కూడా చనిపోయారు.
ఇక ఇప్పుడు సైన్ చేస్తున్న ప్రాజెక్ట్స్ చూస్తుంటే ప్రభాస్ అసలు పెళ్లి చేసుకునే ఆలోచనలో లేడు అనేది క్లియర్ కట్ గా అర్ధమవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘ది రాజా సాబ్’ షూట్ లో పాల్గొంటున్నాడు. ఆ తర్వాత హనూ రాఘవపూడి డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఫౌజీ షూట్ లో పాల్గొంటాడు. డిసెంబర్ నుంచి సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ సినిమాలో యాక్ట్ చేయనున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న ‘సలార్ 2’ లో నటిస్తాడు.
2025 చివరి నుంచి… నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కీ 2 సినిమా చేస్తాడు. ఆ తర్వాతి నుంచి ప్రశాంత్ వర్మ సినిమా షూట్ కు అటెండ్ అవుతాడు. మరో వైపు లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్ మూవీ ఉందని టాక్. స్పిరిట్ కూడా రెండు పార్ట్ లు ఉండవచ్చు అనే టాక్ కూడా ఉంది. అంటే ఇంకో 5 ఏళ్ళ పాటు ప్రభాస్ ఓ పది ప్రాజెక్ట్ లు లైన్ చేసుకున్నాడు. ఈ టైం లో పెళ్లి చేసుకోవడం అనేది ఇంపాజిబుల్. అప్పటికి ప్రభాస్ కు సరిగా 50 ఏళ్ళు వస్తాయి. ప్రభాస్ డేట్స్ ఇస్తే సినిమాలు చేద్దామని కథలు రాసుకుని రెడీగా ఉన్నారో మరో ముగ్గురు నలుగురు డైరెక్టర్లు. సో డోంట్ టాక్ అబౌట్ రెబల్ మ్యారేజ్… వాచ్ అప్ కమింగ్ మూవీస్.