సౌత్ స్టార్ మ్యూజిక్ (South Star Music) కంపోజర్స్ లో రాక్ స్టార్ (Rock Star) దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) క్రేజే వేరు.. తన రాకింగ్ మ్యూజిక్‌తో రెండు దశాబ్దాలపాటు తెలుగు తమిళ భాషల్లో టాప్ ప్లేస్ లో కొనసాగాడు.. ఎన్నో సినిమాలకు చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అందించాడు.. మాస్, క్లాస్, రొమాంటిక్.. ఇలా అన్ని రకాల జోనర్స్ కి ఆయనే ఫస్ట్ ఛాయిస్ గా మారాడు.
అద్భుతమైన పాటలే కాదు, అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు.. మధ్యలో డీఎస్పీ (DSP) క్రేజ్‌కు కాస్త గ్యాప్ వచ్చినాథమన్ హవా మొదలైన తర్వాత రేసులో కాస్త వెనకబడిపోయినప్పటికీ.. మళ్లీ కమ్ బ్యాక్ అయ్యాడు.. ఒకేసారి అర డజనుకు పైగా సినిమాలకు వర్క్ చేస్తూ తనను విమర్శించిన వాళ్లకు గట్టి ఆన్సర్ ఇస్తున్నాడు..
2020లో ‘సరిలేరు నీకెవ్వరూ’ (Sarileru Neekevvaru) సినిమాకు సంగీతం సమకూర్చిన దేవిశ్రీ ప్రసాద్.. 2021లో ‘ఉప్పెన’, ‘పుష్ప: ది రైజ్’ (Pushpa: The Rise) చిత్రాలతో సత్తా చాటాడు. 2022లో 8 సినిమాలకు వర్క్ చేసినా, ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దొరకలేదు. ఇక 2023లో ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాకు మాత్రమే పని చేసాడు.. దీంతో అందరూ డీఎస్పీ పనైపోయిందనే కామెంట్స్ చేసారు. అయితే ‘పుష్ప’ (Pushpa) చిత్రానికిగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డుతో దటీజ్ డీఎస్పీ అనిపించుకున్నాడు.. పుష్ప మూవీ హిట్‌తో క్రేజీ ప్రాజెక్ట్ అన్నీ మళ్లీ దేవిశ్రీని వెతుక్కుంటూ వచ్చాయి.. దీంతో.. దేవిశ్రీ మళ్లీ ఫుల్ బిజీ అయిపోయాడు..
ఎట్ ప్రజెంట్ దేవి శ్రీ చేతిలో మొత్తంగా అరడజను సినిమాలు ఉన్నాయి.. వాటిలో పుష్ప ది రూల్, తండేల్, ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagat Singh), నాగార్జున ధనుష్ లతో శేఖర్ కమ్ముల తీస్తున్న మూవీ ఇక వీటితో పాటు తమిళ్ లో సూర్య, శివ ల కంగువ, అలానే విశాల్ హరిల రత్నం వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.. వీటిల్లో కొన్ని చిత్రాలు ఈ ఏడాదే రిలీజ్ కాబోతున్నాయి. ఇవన్నీ తప్పకుండా సంగీత ప్రియులను అలరిస్తాయని దేవీ ఫ్యాన్స్ గట్టిగా చెబుతున్నారు.. అదే ఊపుతో రాబోయే రోజుల్లో రాక్ స్టార్ మరిన్ని చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ అందించాలని కోరుకుంటున్నారు.