టాలీవుడ్ లో ఎన్నో అంచనాలు పెట్టుకున్న సినిమాలు హ్యాండ్ ఇస్తున్నాయి. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు మెప్పిస్తున్నాయి. అవి కూడా స్ట్రైట్ మూవీస్ కాదు. డబ్బింగ్ సినిమాలు. దీంతో త్వరలో రిలీజ్ కానున్న తమిళ్ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది.వాటి రైట్స్ కోసం నిర్మాతలు పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టాలీవుడ్ లో తమిళ్ డబ్బింగ్ సినిమాలకు డిమాండ్ పెరుగుతోంది.లాస్ట్ ఇయర్ రిలీజైన విక్రమ్ ఈ ఏడాది వచ్చిన వారసుడు, విడుదల, బిచ్చగాడు 2 సినిమాలు తెలుగులో మంచి వసూళ్లు రాబట్టాయి.తాజాగా రిలీజైన జైలర్ కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది.ఆల్రెడీ 50 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది. ఈ ట్రెండ్ రాబోయే తమిళ్ సినిమాలకు ప్లస్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ లియో. దసరా బరిలో దిగుతున్న ఈ మూవీ తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. ఎందుకంటే కొన్నేళ్లుగా విజయ్ మార్కెట్ తెలుగులో పెరుగుతూ వస్తోంది. పైగా ఇది లోకేష్ కనకరాజ్ సినిమా. అతడికీ ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్, సంజయ్ దత్, త్రిష లాంటి స్టార్ కాస్టింగ్ ఈ సినిమాలో ఉండటం ప్రేక్షకుల్లో ఎగ్జైట్మెంట్ ని క్రియేట్ చేస్తోంది.ఇక లియో తెలుగు రైట్స్ ని సితార సంస్థ 19 కోట్లకి దక్కించుకుంది. ఫస్ట్ డే టాక్ ఏమాత్రం బాగున్న విజయ్‌కి తెలుగులో బ్లాక్ బస్టర్ పడటం ఖాయం.
తెలుగులో భారీ క్రేజ్ తెచ్చుకున్న మరో తమిళ్ మూవీ ‘కంగువ’. సూర్యకు మామూలుగానే తెలుగులో మంచి మార్కెట్ ఉంది.ఆకాశం నీ హద్దురా, జై భీమ్ తో పాటు రోలెక్స్ క్యారెక్టర్ హైలెంట్ అవ్వడంతో ఇప్పుడు అది మరింత పెరిగింది.తాజాగా రిలీజైనా కంగువా టీజర్ ట్రెండ్ బెండ్ తీసింది.ఇందులో సూర్య గెటప్ చూసి విలనా? హీరోనా ?అన్న సందేహాలు మొదలైయ్యాయి. మాస్ మాసాల సినిమాలు తీసే శివ నుంచి ఇలాంటి ప్రాజెక్ట్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.ప్రజెంట్ షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఇప్పటికే నార్త్ లో 400 కోట్ల దాకా బిజినెస్ చేసిన కంగువ తెలుగులో కూడా భారీ ఎత్తున అమ్ముడు పోయ్యే ఛాన్స్ ఉంది.
కార్తీ హీరోగా రాజు మురగన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ జపాన్. ఇందులో కార్తీ వివిధ గటప్స్ లో దొంగగా కనిపించబోతున్నాడు.ఇప్పటికే విడుదలైన టీజర్ పేలింది. దానికి తగ్గటే ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. కార్తీ నటించిన సినిమాలన్నిటిలో ఇదే హైయెస్ట్. తెలుగులో కూడా ఈ సినిమాకి ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే వచ్చే దీపావళికి ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్.మొత్తానికి లియో, కంగువ, జపాన్ సినిమాలకు తెలుగులో భారీ ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కథ ఏమాత్రం మన ఆడియన్స్ కి కనెక్ట్ అయినా కలక్షన్స్ వర్షం కురవడం గ్యారెంటీ.