సూపర్‌హిట్ సినిమాకు (Super Hit Movie) సీక్వెల్ తీస్తే.. ఆటోమెటిక్‌గా హైప్ వస్తుంది. బడ్జెట్ అమాంతం పెరిగిపోతోంది. హీరోహీరోయిన్లు.. దర్శకుడు రెమ్యునరేషన్ డబుల్.. ట్రిపుల్ చేసేస్తారు. ఫస్ట్ పార్ట్‌ను ఎంత బడ్జెట్‌లో తీశారు.. సీక్వెల్ దగ్గరకొచ్చేసరికి ఎంత పెరుగుతోంది. ఎంత హైప్ వున్నా.. పెరిగిన బడ్జెట్‌తో వర్కవుట్ అవుతుందా అంటే అదీ గ్యారెంటీ లేదు. సంక్రాంతికి వచ్చిన హనుమాన్ రికార్డులతో షాక్ ఇచ్చింది. మహేశ్ (Mahesh Babu) గుంటూరుకారం (Guntur Karam) ను ఎదుర్కొని మరీ.. 156 కోట్ల షేర్‌తో సంక్రాంతి మొనగాడు అనిపించుకుంది. బడ్జెట్ 40 కోట్లు అయితే.. 30 కోట్లకు థియేటరికల్ రైట్స్ అమ్ముడయ్యాయి. 126 కోట్ల లాభంతో బాహుబలి 2 (Baahubali 2) తర్వాత ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన చిత్రంగా సెకండ్ ప్లేస్‌లో నిలిచింది హనుమాన్. హనుమాన్‌కు సీక్వెల్‌గా జై హనుమాన్ తీస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌ను 40 కోట్లతో తీస్తే.. సీక్వెల్ దగ్గరకొచ్చేసరికి 100 కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. దర్శకుడు ప్రశాంత్ వర్మ.. హీరో తేజ్ సజ్జా రెమ్యునరేషన్ డబుల్ ట్రిపుల్ దాటిపోయాయి.
ఇంతటి భారీ హిట్‌కు సీక్వెల్ అంటే… హైప్ మామూలుగా వుండదు. హిందీలోనూ 50 కోట్ల నెట్ కలెక్ట్ చేయడంతో మార్కెట్ పెరిగింది. హనుమాన్ (Hanuman) లా మొదటి రోజు 3..4 కోట్లు కాకుండా.. 30.. 40 కోట్లు రాబట్టే ఛాన్స్ వుంది. కాంతారను 20 కోట్లతో తీస్తే.. 350 కోట్లు తీసుకొచ్చింది. ఈ సినిమా సీక్వెల్ బడ్జెట్ 200 కోట్లు దాటుతోంది. ఎందుకంత ఖర్చు అంటే.. కాంతారాను మించి వుండాలన్న భయం అంత ఖర్చు పెట్టిస్తోంది. కాంతారా హిట్‌లో రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ కాంతారా బడ్జెట్ 20 కోట్లను దాటిపోయింది. భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ఊర్వశి రౌతేలను తీసుకున్నాడు రిషబ్. పారితోషికాలు.. ప్రొడక్షన్ కాస్ట్ ఒకటేంటి.. అన్ని అన్నీ కలిసి కాంతారా బడ్జెట్‌ను 200 కోట్లకు పెంచేశాయి. సెట్స్‌పై వున్న మరో క్రేజీ సీక్వెల్ పుష్ప2. అల్లు అర్జున్ (Allu Arjun) తొలి పాన్ ఇండియా మూవీ పుష్ప రిలీజైన ప్రతి భాషలో ఆడేయడంతో.. పుష్ప2పై భారీ అంచనాలున్నాయి. ఇలా అంచనాలే కాదు.. బడ్జెట్ కూడా ఓ రేంజ్‌లో పెరిగిపోయింది.
పుష్పకు 40 కోట్లు తీసుకున్న అల్లు అర్జున్ పుష్ప2 దగ్గరకొచ్చేసరికి డబుల్ తీసుకున్నాడని..కాదు కాదు.. 100 కోట్లు దాటిపోయాడంటూ వార్తలొస్తున్నాయి. పుష్ప 130 కోట్లతో తెరకెక్కితే… పుష్ప2 బడ్జెట్ 300 కోట్లు దాటిపోయింది. నటీనటులు.. టెక్నీషియన్స్ రెమ్యునరేషనే200 కోట్లు అవుతోంది. బాహుబలి2 హిందీలో 511 కోట్లు కలెక్ట్ చేస్తే.. ఆ రేంజ్‌లో ప్రభాస్ సినిమా ఒక్కటీ రాలేదు. ఎట్టకేలకు సలార్ హిందీలో 200 కోట్లు కలెక్ట్ చేసింది. షారూక్ ఖాన్ డంకీతో పోటీపడడంతో.. ఓపెనింగ్స్ తగ్గినా.. లాంగ్‌రన్‌లో మంచి వసూళ్లనే రాబట్టింది. సలార్‌ను ఆదరించిన ప్రేక్షకులు సలార్2 కోసం వెయిట్ చేస్తున్నారు. సెప్టెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి 2025లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ మించి సెకండ్‌పార్ట్ హిట్ కావాలన్న లక్ష్యం.. భయం పుట్టిస్తోంది. ఎక్కువ టైం తీసుకోవడం.. రెమ్యునరేషన్ పెంచేయడం.. గ్రాండ్ లుక్ కోసం భారీగా ఖర్చుపెట్టడం ఇలా.. అన్నీ కలిసి బడ్జెట్‌ను పెంచేస్తున్నాయి. సినిమా నిర్మాణ వ్యయం 200.. 300 కోట్లయితే.. బిజినెస్ ఆ రేంజ్‌లో జరుగుతుందా? హైప్ వుంది కాబట్టి అవుతుందనుకుంటే.. సినిమా హిట్టయినా.. భారీ లాభాలు రావడం కష్టమే. 20 కోట్ల సినిమా 350 కోట్లు తీసుకొస్తే.. ఈ రేంజ్‌లో 300 కోట్ల సినిమా హిట్ కావాలంటే.. వేల కోట్లు తీసుకురావాలి