దీనిపై ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ లేకపోయినా.. సినీ వర్గాల్లో టాక్ మాత్రం గట్టిగానే వినిపిస్తోంది. సీతారామంతో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు దుల్కర్. డైరెక్టర్ వెంకీ కూడా సార్ మూవీతో 100 కోట్ల క్లబ్లో చేరాడు. దుల్కర్ కోసం ఇప్పటికే చాలా మంది డైరెక్టర్స్ స్టోరీస్ రెడీ చేస్తున్నారు. కానీ దుల్కర్ మాత్రం వాళ్లందరినీ పక్కనపెట్టి వెంకీకి ఓకే చెప్పాడట.
2018లో మహానటి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు దుల్కర్. సినిమా హిట్ అయినా దుల్కర్‌కు అది పెద్దగా ప్లస్ అవ్వలేదు. మహానటి ఫిమేల్ సెంట్రిక్ మూవీ కావడంతో క్రెడిట్ మొత్తం కీర్తి సురేష్‌కు వెళ్లిపోయింది. మహానటితో తెలుగు ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగు ప్రజలకు సీతారామం సినిమాతోనే దుల్కర్ దగ్గరయ్యాడు. తన మార్క్ యాక్టింగ్‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరోసారి వెంకీ అట్లూరితో తన లక్ ట్రై చేయబోతున్నాడు. సార్ సినిమా తెరకెక్కించిన సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లోనే ఈ సినిమా కూడా రాబోతోందని టాక్. మంచి సోషల్ మెసేజ్‌తో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో స్టోరీ సిద్ధం చేశాడట వెంకీ. సార్ మూవీతో మంచి హిట్ ఇచ్చిన ఈ డైరెక్టర్ దుల్కర్‌కు ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.