ఇండియాలో ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడం.. ఇలా ఏ భాషల్లో చూసినా పదుల సంఖ్యలో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తెరకెక్కుతున్నాయి. మినిమమ్ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాలు కూడా.. పాన్ ఇండియా హంగులను అద్దుకుంటూ బాలీవుడ్ లో హిట్ కొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఈ విషయంలో ఫస్ట్ టైం ఓ అడుగు ముందుకేసింది మల్లూవుడ్. కింగ్ ఆఫ్ కోతా తో పాన్ ఇండియా ఎటాప్ట్ ని చేస్తోంది.
టాలీవుడ్ లో తెరకెక్కిన బాహుబలి, ఆర్ఆర్ఆర్, పష్ప సినిమాలు తెలుగు సినిమా స్థాయిని పాన్ వరల్డ్ రేంజ్ కి చేర్చాయి. కోలీవుడ్ లో రిలీజైన పొన్నియన్ సెల్వన్, జైలర్, విక్రమ్ సినిమాలు నేషనల్ వైడ్ గా హాల్ చల్ చేశాయి. కన్నడ నుంచి వచ్చిన కేజీఎఫ్, కాంతారా సౌత్ ,నార్త్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.ఇలా సౌత్ లో ఈ మూడు ఇండస్ట్రీస్ పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటితే ఈ ట్రెండ్ ని ఫాలో అవ్వడంలో వెనకబడిపోయింది మల్లూవుడ్. అక్కడ ఇంకా లో-బడ్జెట్, సింపుల్ చిత్రాలనే తెరకెక్కిస్తున్నారు మేకర్స్.
అయితే ఫస్ట్ టైం ఈ క్లబ్ లో అడుగు పెట్టబోతున్నాడు దుల్కర్ సల్మాన్. కింగ్ ఆఫ్ కోతా ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ మల్లూవుడ్ లో ఈ ఏడాది విడుదలైన మిన్నల్ మురళి, 2018 సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. 100 కోట్లు వసూళ్లు చేశాయి. కానీ ఇవి పాన్ ఇండియా టార్గెట్‌గా తెరకెక్కలేదు. దుల్కర్ సల్మాన్ ఇతర భాషల్లో పనిచేశాడు గానీ.. మల్లూవుడ్ తరఫున డైరెక్ట్‌గా పాన్ ఇండియా మూవీ చేయలేదు. ఇప్పుడు కింగ్ ఆఫ్ కోతా తో ఈ ప్రయత్నం చేస్తున్నాడు. ఆగస్ట్ 25న తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ, హిందీ భాషల్లో ఈ ప్రాజెక్ట్ ని రిలీజ్ చేస్తున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో ఈ ప్రాజెక్ట్ పై మంచి బజ్ ఉంది. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీ కాబట్టి నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈ వీక్ ఎండ్ ఎలాంటి హిట్ ని అందుకుంటుందో.. ఇతర మాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌కు ఎలాంటి భరోసా అందిస్తుందో చూడాలి.