NBK 109: తప్పుకున్నాడా.. బాలయ్యకు దుల్కర్ హ్యాండించాడా..

బాలకృష్ణ చెయ్యబోయే నూతన చిత్రం కొన్ని నెలల క్రితం ప్రారంభం అయ్యింది. NBK109గా తెరకెక్కుతున్న ఈ చిత్రం, కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకొంది. ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - March 5, 2024 / 02:16 PM IST

NBK 109: అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి.. ఇలా వరుస హ్యాట్రిక్ విజయాలతో బాలకృష్ణ మంచి జోరు మీద ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన అప్‌కమింగ్ మూవీ మీద సహజంగానే అందరిలో ఆసక్తి నెలకొని ఉంటుంది. ఇక బాలయ్య ఫ్యాన్స్‌కి అయితే చెప్పక్కర్లేదు. ప్రతిరోజు మూవీకి సంబంధించిన డీటెయిల్స్ కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తూనే ఉంటారు ఫ్యాన్స్. తాజాగా ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది.

Vishwambhara: పూనకాలు లోడింగ్.. విశ్వంభర విలన్ దొరికాడు..

బాలకృష్ణ చెయ్యబోయే నూతన చిత్రం కొన్ని నెలల క్రితం ప్రారంభం అయ్యింది. NBK109గా తెరకెక్కుతున్న ఈ చిత్రం, కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకొంది. ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడనే వార్తలు గతకొంత కాలం నుంచి వస్తున్నాయి. అది అక్షరాలా నిజమే అన్నవాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ మూవీకి హిట్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈయన గత మూవీ వాల్తేరు వీరయ్య హిట్ అవ్వడంతో బాలయ్య మూవీపై అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే బాలయ్య లుక్ ఎలా ఉండబోతుందో అనే దాని మీద కూడా అటు ఫ్యాన్స్‌లోను, ప్రేక్షకుల్లోను క్యూరియాసిటీ ఉంది.

ఎందుకంటే తన గత 3 చిత్రాల్లో కూడా బాలయ్య డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్‌లో కనపడి ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీలో బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా లాంటి వారు ఇప్పటికే కన్ఫార్మ్ అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన భారీ తారాగణం అంతా ఈ చిత్రంలో నటించబోతుంది.