Varun Tej: టాలీవుడ్‌లో ఈ వారం అరడజను కొత్త సినిమాలు వస్తున్నాయి. అందులో మెగాప్రిన్స్ వరున్ తేజ్ గాండీవధార అర్జున కూడా ఉంది. కాకపోతే ఈ వారం వరుణ్ తేజ్ సినిమాకే కాదు, కార్తికేయ నటిస్తున్న బెదురులంక మూవీకి కూడా డబ్బింగ్ సినిమా అయినా కింగ్ ఆఫ్ కోతనే పోటీ ఇచ్చేలా ఉంది. ఇది నిజంగా సెల్ఫ్ గోలే. ఒకప్పుడు దుల్కర్ సల్మాన్ అంటే ఎవరికీ తెలియదు. ఆ తర్వాత్తర్వాత మమ్ముటి కొడుకన్నారు. కట్ చేస్తే మలయాళంలో ఒకటి రెండు హిట్లు పడ్డాక ఇక్కడ కూడా కొద్దిమందికి తెలిశాడు.
అలాంటి టైంలో మహానటి మూవీలో దుల్కర్‌ని తీసుకోమని నాగబాబు అప్పట్లో నాగ్ అశ్విన్‌కి సలహా ఇచ్చాడట. ఇక సీతారామం కథ నిజానికి ముందు వరుణ్ తేజ్ దగ్గరికి వస్తే తనకి సెట్ అవదని, దుల్కర్ పేరు ప్రపోజ్ చేశాడట. అలా దుల్కర్ సల్మాన్‌కి మహానటి, సీతారామం ఆఫర్లతో పాటు హిట్లు వచ్చాయి. ఇక్కడ లోకల్ హీరోకి ఈక్వల్‌గా మార్కెట్ వచ్చేసింది. కట్ చేస్తే ఇప్పుడు మెగా ప్రిన్స్ మూవీకి దుల్కర్ సల్మాన్ సినిమా కింగ్ ఆఫ్ కోతా పోటీ ఇస్తోంది. ఎంత విచిత్రం అంటే గాండీవధారి అర్జున కంటే కింగ్ ఆఫ్ కోతాకే 300 స్క్రీన్లు ఎక్కువ దొరికాయట.
కింగ్ ఆఫ్ కోతా మాస్ మూవీ అవటం, ఈ హీరోకి ఇక్కడ మార్కెట్ భాగా పెరగటంతో ఇలా లెక్కలు మారాయి. ఇదంతా చూస్తుంటే మెగా కాంపౌండ్ నిర్ణయాల వల్లే దుల్కర్ సల్మాన్ ఏకులా వచ్చి ఇప్పుడు మెగా హీరోల మూవీలకే మేకయ్యాడు.