SALAAR: సలార్‌కి పోటీ ఇచ్చే సత్తా.. డంకీ, ఆక్వామ్యాన్ 2కి లేదా..?

డంకీ మూవీ జస్ట్ బిలో యావరేజ్ ఉందట. ఇక ఆక్వామ్యాన్ సీక్వెల్ ఆక్వామ్యాన్ 2 గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

  • Written By:
  • Publish Date - December 21, 2023 / 06:42 PM IST

SALAAR: సలార్ డిసెంబర్ 22న రిలీజ్. ఒకరోజు ముందే ప్రివ్యూ రూపంలో ఈమూవీ యూఎస్‌ని కుమ్మేస్తుంది. యూఎస్‌లో ప్రివ్యూకే రూ.20 కోట్లు వచ్చాయి. ఆరేంజ్ సునామీని సలార్ క్రియేట్ చేస్తుంటే.. వన్ డే బిఫోర్ డంకీ అని షారుక్, ఆక్వామ్యాన్ 2తో హాలీవుడ్ హీరో ఎటాక్ చేశారు. విచిత్రం ఏంటంటే డంకీ మూవీ జస్ట్ బిలో యావరేజ్ ఉందట. ఒకవైపు షారుఖ్, మరో వైపు హిట్లు తప్ప ఫెయిల్యూర్స్ తెలియని బాలీవుడ్ రాజమౌళి లాంటి డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ.. వీళ్ల కాంబినేషన్ అదుర్స్ అనిపిస్తుందనుకుంటే బెదుర్స్ అనిపించిందట.

Salaar Song: ఎమోషనల్ టచ్.. సలార్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్

సరిలేరు నీకెవ్వరులోలానే హీరో ఆర్మీనుంచి తనకు సాయం చేసిన వ్యక్తి కోసం అతని ఊరుకెళతాడు. తన కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నంలో తన చెల్లిన అంటే హీరోయిన్ ని లండన్ చేరుస్తాడు. ఇందుకోసం తనెంత రిస్క్ చేశాడనేదే కథ. దొంగదారిలో యూరప్ వెళ్లే వలసదారుల ఎమోషన్సే కథాంశంగా తీసుకున్న రాజ్ కుమార్ హిరానీకి.. మరే కథ వస్తువు దొరకలేదో, చెప్పే పద్దతి బాగా కుదర్లేదో కాని.. ఇది షారుక్ రేంజ్ మూవీ కాదనేస్తున్నారు. విచిత్రం ఏంటంటే తన ఫ్రెండ్ చెల్లెలికోసం సాయం చేయాలని వెళ్లిన హీరో పాత్ర పెద్దగా కనెక్ట్ కావట్లేదట.

ఇక లండన్ వెళ్లాలనుకునే బ్యాచ్ లైఫ్ రిస్క్ చేయాల్సినంత రీజన్ కథలో కనిపించకపోవటం ఎమోషనల్ కనెక్షన్ మిస్ అవటానికి కారణం అవుతోంది. ఇక ఆక్వామ్యాన్ సీక్వెల్ ఆక్వామ్యాన్ 2 గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఫస్ట్ పార్ట్‌లో మనుషులు, సాగరలోకం.. రెండింటి మధ్య కనెక్షన్‌లాంటి ట్విస్టులు థ్రిల్ చేస్తాయి. ఇలా రొటీన్ తెలుగు సినిమాలా ఉందే కాని, గ్రాఫిక్స్ మించి మూవీలో ఏం లేదనే టాకే పెరిగింది. ఓవరాల్‌గా సలార్ సునామీని ఫేస్ చేసేంత కంటెంట్ డంకీలో కాని, ఆక్వామ్యాన్ 2లో కానీ లేవని తేలిపోయింది.