DUNKI Vs SALAAR: కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ డంకీ ఈనెల 21న రాబోతోంది. 22న సలార్ ఎలాగూ దండెత్తనుంది. ఆల్రెడీ ఈ రెండింటి మధ్యే నార్త్ మార్కెట్లో 40 శాతం థియేటర్లు డంకీకి, పెద్ద మూవీ కాబట్టి సలార్‌కి 60శాతం థియేటర్లు కేటాయించారు. అక్కడే డంకీ మూవీ.. సలార్ ముందు తగ్గాల్సి వచ్చింది. ఇంత చేస్తే ఇప్పుడు హాలీవుడ్ మూవీ ముందు కూడా డంకీ తగ్గాల్సి వస్తోందట. డంకీకి దక్కిన 40 శాతం థియేటర్స్‌లో 15 శాతం థియేటర్లు సడన్‌గా హాలీవుడ్ మూవీ ఆక్వామెన్2కి వెళ్లాయట.
Rajinikanth: క్రేజీ కాంబో.. రజినీకాంత్ కోసం రంగంలోకి దిగనున్న రణ్‌వీర్ సింగ్..
ఇక సలార్ మూవీని కొన్న బ్యాచ్ మాత్రం ఎవరూ హాలీవుడ్ మూవీ ఆక్వామ్యాన్ 2 వైపు మొగ్గుచూపట్లేదు. అంతవరకు సలార్ మూవీ సేఫే అని తెలుస్తోంది. కాకపోతే షారుఖ్ మూవీ డంకీకి దక్కిన 40శాతం థియేటర్స్‌లో కూడా 15 శాతం హాలీవుడ్ ఆక్వామ్యాన్2 కి పోవటం డంకీకి పెద్ద దెబ్బే. అయితే ఆక్వామ్యాన్‌కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఆక్వామ్యాన్ 2 హాలీవుడ్ మూవీనే అయినా ఇండియాలో మంచి గిరాకీ ఉన్న కాన్సెప్ట్. మొదటి భాగం ఇండియాలో రూ.300 కోట్లు రాబట్టింది. కాబట్టే, సీక్వెల్ అంతకంటే ఎక్కువ రాబడుతుందనే టాక్ పెరిగింది. ఏదేమైనా ఆక్వామ్యాన్ 2 మొత్తం డ్యూరేషన్ కూడా డంకీ మూవీని భయపెడుతోంది. కేవలం రెండుగంటలే నిడివి ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. 2 గంటల 41 నిమిషాలతో డంకీ, మూడు గంటలకు దగ్గరగా సలార్ డ్యూరేషన్ ఉంది. ఏమాత్రం డంకీ టాక్ అటు ఇటైనా, అంతా ఆక్వామ్యాన్ 2కి షిఫ్ట్ అవుతారు.
అలా డంకీ మొదటి రోజు వసూళ్లని ఆక్వామ్యాన్ 2 ప్రభావితం చేసేలా ఉంది. ఎలాగూ మరుసటి రోజు సలార్ కాబట్టి ఆ దెబ్బ కూడా కన్ఫామ్. అయితే డంకీ, సలార్ మూవీలు ఏమాత్రం టాక్ వీకైనా వాటి థియేటర్స్‌ని లాక్కునేందుకు యానిమల్ మూవీ రెడీగా ఉంది. రిలీజై మూడు వారాలు గడుస్తున్నా దాని ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. రోజూ రూ.30 కోట్ల పైనే వసూళ్లు రాబడుతోంది. ఇక డంకీ, సలార్ మూవీలు ఏమాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నా దానికంటే తక్కువ డ్యూరేషన్ కాబట్టి చాలా వరకు ఆక్వామ్యాన్ 2 వైపు జనం మొగ్గుచూపే ఛాన్స్ ఉంది. కాబట్టి, అది రెండు సినిమాలకు కూడా ప్రమాదమే.