DUNKI: డంకీతో మ్యాజిక్ రిపీటయ్యేనా..? షారుఖ్, హిరానీ కాంబో హిట్ కొడుతుందా..?

సామాజికాంశాలే రాజ్‌కుమార్‌ సినిమా ఇతివృత్తాలు. ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’, ‘లగే రహో మున్నాభాయ్‌’, ‘త్రీ ఇడియట్స్‌’, ‘పీకే’, ‘సంజు’.. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలన్నీ సూపర్‌ హిట్లే.

  • Written By:
  • Publish Date - December 19, 2023 / 03:17 PM IST

DUNKI: దర్శకుడు రాజ్ హిరానీ, హీరో షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో వస్తున్న మూవీ డంకి. సెన్సేషనల్ కాన్సెప్ట్స్‌తో కథలు అల్లుకునే వెర్సటైల్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, ఇప్పుడు మరో కొత్త కథాంశంతో డంకిని తయారుచేసినట్టు తెలుస్తోంది. సామాజికాంశాలే రాజ్‌కుమార్‌ సినిమా ఇతివృత్తాలు.

SALAAR Vs DUNKI: దిగజారుడు.. సలార్‌పై విషం కక్కుతున్న బాలీవుడ్

దానికి కామెడీ టచ్‌ ఇవ్వడం ఆయన ప్రత్యేకత. ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’, ‘లగే రహో మున్నాభాయ్‌’, ‘త్రీ ఇడియట్స్‌’, ‘పీకే’, ‘సంజు’.. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలన్నీ సూపర్‌ హిట్లే. అటు.. రెండు బ్లాక్‌బ్లస్టర్ల తర్వాత షారుక్‌ నటించిన చిత్రం కావడం, ఇటు.. పరాజయం ఎరగని హిరాణీ డైరెక్ట్‌ చేసిన సినిమా కావడం, తొలిసారి ఈ ఇద్దరూ కలిసి పనిచేయడం.. ఇలా పలు కోణాల్లో ‘డంకీ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. షారుక్‌- హీరోయిన్‌ తాప్సి కలిసి నటించిన ఫస్ట్‌ మూవీ కూడా ఇదే. ఈ సినిమాలో హీరో విక్కీ కౌశల్‌ అతిథి పాత్ర పోషించడం విశేషం.

75 రోజుల్లో చిత్రీకరణ పూర్తయింది. వాటిలో షారుక్‌ ఖాన్‌ 60 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నారు. ప్రి ప్రొడక్షన్‌ దశ నుంచి విడుదల వరకు ఈ సినిమాకి దాదాపు రెండున్నరేళ్ల సమయం పట్టింది. ఈ సినిమా ప్రొడక్షన్‌ కాస్ట్‌ రూ.85 కోట్లు. గత ఆరేళ్లలో షారుక్‌ నటించిన వాటిలో అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందింది ఇదే. ఆర్టిస్ట్‌ల రెమ్యునరేషన్‌, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్‌ రూ.120 కోట్లు. ప్రభాస్ నటించిన సలార్ మూవీ, డంకి మూవీలు ఒకే రోజున విడుదలకానున్నాయి. డిసెంబర్ 21న బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రెండు సినిమాలు ఢీ కొట్టబోతున్నాయి. మరి, ప్రేక్షకులు ఏ సినిమాకు సలాం కొడతారో అని, పాన్ ఇండియా మొత్తం గుసగుసలు మొదలయ్యాయి.