Salaar Movie : ‘సలార్’లో దుమ్మురేపేసే ఐటమ్ సాంగ్..!

బాహుబలి (Baahubali) సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కెరీర్ లో ఒక్క చెప్పుకోదగ్గ హిట్ కూడా పడలేదు. ఈ మధ్యనే భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది.

బాహుబలి (Baahubali) సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కెరీర్ లో ఒక్క చెప్పుకోదగ్గ హిట్ కూడా పడలేదు. ఈ మధ్యనే భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ సినిమా కూడా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. తాజాగా ఇప్పుడు అభిమానులు అందరూ ప్రభాస్ తదుపరి సినిమా సలార్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

KCR Vs Revanth Reddy : కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి పోటీ.. గెలిచే సీన్ ఉందా.. కామారెడ్డి టాక్ ఏంటి?

కే జి ఎఫ్ ( KGF) సినిమాతో పాన్ ఇండియా (Pan India Star) రేంజ్ లో పేరు తెచ్చుకున్న కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. డిసెంబర్ 22 రిలీజ్ కు రెడీ అవుతుండగా.. ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను రీ షూట్ చేయడంతో పాటు చిత్ర బృందం సినిమాలో ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్ ని కూడా జత చేసిందట. అందుకే సినిమాని సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కి వాయిదా వేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ స్పెషల్ ఐటెం సాంగ్ (Item Song) లో ప్రభాస్ తో కలిసి స్టెప్పులు వేయబోతున్న హీరోయిన్ ఎవరు అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ పాట శ్రీలీలతో చేయించనున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే ట్యూన్ తో స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారట. త్వరలో ఈ పాటకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ బయటకు రానున్నాయి. మరోవైపు సినిమా విడుదల తేదీ కూడా దగ్గర పడుతూ ఉండడంతో చిత్రబృందం ప్రమోషన్ లని మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీపావళి సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలక అప్డేట్స్ బయటకు రాబోతున్నట్లు సమాచారం.