గత రెండు మూడు నెలల నుంచి తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం పెద్ద సంచలనం అవుతోంది. దీనికి సంబంధించి ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా దువ్వాడ శ్రీనివాస్ గాని ఆయన ప్రియురాలు మాధురి గాని వెనక్కు తగ్గడం లేదు. మాధురి కోసం అవసరమైతే రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పడానికి దువ్వాడ శ్రీనివాస్ సిద్దం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దువ్వాడ వాణి, ఆమె కుమార్తెలు ఎన్ని విధాలుగా పోరాటాలు చేసినా సరే శ్రీనివాస్ మాత్రం తన ఇంటిని దివ్వెల మాధురి పేరున రిజిస్ట్రేషన్ చేసారు.
ఆ తర్వాత వివాదం మరింత పెద్దది అయింది. దువ్వాడ వాణి, మాధురి ఇద్దరూ బూతులు తిట్టుకోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇక ఇటీవల తిరుమల వెళ్ళిన ఈ జంట వివాహం చేసుకుంటారు అనే ప్రచారం కూడా జరిగిన సంగతి తెలిసిందే. తిరుమలలోనే వివాహం చేసుకున్నారనే వార్తలు రాగా వాటిని ఇద్దరూ ఖండించారు. ఇప్పుడు ఇద్దరూ కలిసే ఉండటంతో వాణి ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఇటీవల తన భర్తతో కలిసి ఉండటానికి తాను సిద్దమే అని కూడా ఆమె ప్రకటన చేయడం కాస్త సంచలనం అయింది.
అలాగే పలు చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి… తాము వివాహం చేసుకుంటామని అవసరమైతే పిల్లల్ని కూడా కనే ఆలోచనలో ఉన్నామని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. వివాహం చేసుకోవడానికి ఇద్దరం వైవాహిక జీవితాలకు గుడ్ బై చెప్పాల్సి ఉందని ఇద్దరం విడాకులు తీసుకున్న తర్వాత ముందు అడుగు వేస్తామని తెలిపారు. దీనితో ఈ వ్యవహారం మరింత హాట్ గా మారింది. ఆ తర్వాత ఈ జంట సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ అయింది. శ్రీనివాస్ కోసం మాధురి వంటలు చేయడం ముద్దు పేరు పెట్టి పిలవడం చూసి జనాలు షాక్ అయ్యారు.
అయితే ఇప్పుడు ఈ ప్రేమ కథను సినిమాగా ప్లాన్ చేస్తున్నారు ఓ నిర్మాత. దీనికి సంబంధించి త్వరలోనే శ్రీనివాస్ ను కూడా కలవడానికి రెడీ అవుతున్నారట. శ్రీనివాస్ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు తర్వాత మాధురికి ఎలా దగ్గరయ్యారు అనే దానిపై ఈ బయోపిక్ ఉంటుందని టాక్. పలు కీలక విషయాలను కూడా ఈ సినిమాలో చూపించే అవకాశం ఉందని సమాచారం. బయోపిక్ లో శ్రీనివాస్ స్వయంగా నటించే అవకాశం ఉందని టాక్. దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. డైరెక్టర్ ఎవరు అనేది కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.