EAGLE Vs LAL SALAAM: సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్ వేసిన లాల్ సలామ్ తెలుగులో పెద్దగా హైప్ తెచ్చుకోకపోయినా, కథ కత్తిలా ఉందా అంటే సుత్తి కొడుతోందని ఒక్క మాటలో తేల్చేస్తున్నారు ఆడియన్స్. నిజమే రజినీకూతురు ఐశ్వర్య అప్పట్లో 3 అనే మూవీ తీసింది. మేకింగ్ బాగున్నా, నెరేషన్ సీరియల్‌లా సాగతీతగా ఉండటంతో సీన్ రివర్స్ అయ్యింది. ఇక లాల్ సలామ్‌లో క్రికెట్ నేపథ్యానికి, మతాల మధ్య ఘర్షణ అనే కాన్‌ఫ్లిక్ట్‌ని పెట్టారు.
PAWAN KALYAN: పార్లమెంట్ సీటుపై కన్నేసిన పవన్.. ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..?
అది బానే ఉన్నా, తీసే విధానం బోరింగ్‌గా ఉండటంతో సీన్ రివర్స్ అవుతోంది. దీంతో లాల్ సలామ్ తెలుగులోనే కాదు తమిళ్‌లో కూడా పెద్దగా వెలుగులు విరజిమ్మటం కష్టంగా మారింది. ఏదో రజినీకాంత్ ఉన్నాడని చూడ్డమే తప్ప, తను లేకపోతే, ఆమాత్రం కూడా జనం వచ్చేవాళ్లు కాదు అనేలా భారీగా కామెంట్లు వస్తున్నాయి. ఇక రవితేజ మూవీ ఈగిల్ విషయానికొస్తే, ఫస్ట్ టైం లాంగ్ హెయిర్, భారీ గెడ్డంతో కిక్ ఇస్తున్నాడు. ఇక ఈ మూవీ కథేంటంటే అదో పత్తియాపారం అనేస్తున్నారు. నిజమే ఇందులో ఒక విచిత్రమైన పత్తి దాన్ని పండించే వ్యక్తి, ఫారెన్ కంట్రీతో ఆ పత్తికున్న లింకు, ఇక రా నుంచి విదేశీ సంస్థల వరకు అందరికి ఝలక్ ఇచ్చే రేంజ్ బ్యాగ్రౌండ్ ఉన్న పాత్రలో హీరో ఇవన్నీ బిల్డప్ పరంగా బాగున్నా, కొన్ని సార్లు కాస్త అతిగా అనిపిస్తాయి.
జనాలు కూడా ఇలాంటి రియాక్షనే ఇస్తున్నారు. కొన్ని లాజిక్స్ ని వదిలేస్తే, పాత్రలు, పెర్ఫామెన్స్ లు మేకింగ్ లో జిమ్మిక్కులు చూస్తే ఈగిల్ కి మంచి మార్కులే పడుతున్నాయి. ఓవరాల్ గా ఈ వీక్ లాల్ సలామ్ లో రెహమాన్ పాటలు మాత్రమే పేలితే, థియేటర్స్‌లో ఈగిల్ పేల్చిన తూటాలే పేలుతున్నాయి.