సూపర్ స్టారైనా ఎన్టీఆర్ వెనకే… 1000 అడుగుల దూరం..

దేవర వచ్చి వందలకోట్ల వసూళ్ల సునామీ తెచ్చింది. పాన్ ఇండియాలోనే కాదు, ఓవర్ సీస్ మార్కెట్ లో కూడా వండర్స్ క్రియేట్ చేసిన దేవర, ఇప్పుడుఓటీటీలో వచ్చే శుక్రవారం రాబోతున్నాడు. విచిత్రం ఏంటంటే దేవర ఓటీటీ రిలీజ్ కి ఎగ్జాక్ట్ గా ఒకరోజు ముందు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ వెట్టయాన్ స్ట్రీమింగ్ లోకి రాబోతోంది.

  • Written By:
  • Publish Date - October 30, 2024 / 02:10 PM IST

దేవర వచ్చి వందలకోట్ల వసూళ్ల సునామీ తెచ్చింది. పాన్ ఇండియాలోనే కాదు, ఓవర్ సీస్ మార్కెట్ లో కూడా వండర్స్ క్రియేట్ చేసిన దేవర, ఇప్పుడుఓటీటీలో వచ్చే శుక్రవారం రాబోతున్నాడు. విచిత్రం ఏంటంటే దేవర ఓటీటీ రిలీజ్ కి ఎగ్జాక్ట్ గా ఒకరోజు ముందు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ వెట్టయాన్ స్ట్రీమింగ్ లోకి రాబోతోంది. దేవరని ఒక సారి థియేటర్స్ లో డీకొట్టే ప్రయత్నం జరిగింది. కాని అక్కడ సూపర్ స్టార్ రజినీకాంత్ ఇమేజ్, క్రేజ్ పెద్దగా పనిచేయలేదు. మార్కెట్ లో మైలేజ్ దక్కలేదు. అందుకే పోటీ వద్దనే పక్కకు తప్పుకున్నాడా? ఓటీటీలో బేసిగ్గా కొత్త సినిమా స్ట్రీమింగ్ లో కి రావాలంటే ఖచ్చితంగా ఫ్రైడేనే ముహుర్తం చూసుకుంటారు. పోటీ ఉంటే శనివారం వదులుతారు. కాని వెట్టయాన్ ని తెలుగులో దేవరకంటే ఒకరోజు ముందే లాంచ్ చేస్తున్నారు. ఓటీటీలో పోటీ వద్దనే ఇలా వెనక్కి తగ్గారా..? కథలో ట్విస్ట్ ఏమైనా ఉందా?

టాలీవుడ్, బాలీవుడ్, ఓవర్ సీస్, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినీ సునామీ క్రియేట్ చేసిన దేవర మూవీ ఇప్పుడు ఓటీటీలో రాబోతోంది. ఫ్యాన్స్ లో ఆల్రెడీ పూనకాలు మొదలయ్యాయి. వచ్చేనెల 8న వరల్డ్ వైడ్ గా దేవర సౌత్ వర్షన్ స్ట్రీమింగ్ లో కి రాబోతోంది. తెలుగు,తమిల్, మలయాళం, కన్నడ భాషల్లో ఓటీటీని కుదిపేయబోతోంది దేవర మూవీ.

కాని హిందీ వర్షణ్ మాత్రం నవంబర్ 22న ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వటం కన్ఫామ్ అయ్యింది. సౌత్ వర్షన్ కి, హిందీ వర్షన్ స్ట్రీమింగ్ కి మధ్య అంత గ్యాప్ ఉండటానికి రీజన్ ఒక్కటే. నార్త్ ఇండియాలో ఇంకా దేవర వసూళ్ల కు బ్రేక్ పడలేదు. ఇప్పటి వరకు ఉత్తరాదిన 480 కోట్ల వరకు వసూళ్లు రాబట్టిన దేవర, ఇంకా రోజుకి 12 కోట్ల వరకు రాబడుతూనే ఉంది

ఇలాంటి టైంలో ఓటీటీ రిలీజ్ అంటే కొంతవరకు నార్త్ ఇండియా వసూళ్లకు ఇబ్బందే..కాని ఓటీటీ రూల్స్ ప్రకారం, పెద్ద సినిమాలు విడుదలైన 8 వారాల తర్వాత డిజిటల్ రిలీజ్ అవ్వాలి… అలా ముందే రైట్స్ సేల్ అవటంతో, వచ్చే నెల 8న సౌత్ వర్షన్, 22న హిందీ వర్షన్ ఓటీటీలో రాబోతోంది

ఐతే ఇక్కడ మాత్రం తమిళ సూపర్ స్టార్ రజినకాంత్ ఒకటి కాదు, రెండు కాదు చాలా అడుగులే వెనక్కి వేయాల్సి వచ్చింది. నిజానికి దేవర మూవీ థియేటర్స్ లోకలెక్షన్స్ కుమ్మేస్తుంటే, పోటీగా సీన్ లోకి వచ్చాడు రజినీకాంత్. అలా తన వెట్టయాన్ మూవీ పాన్ ఇండియా లెవల్లో పోటీకి దిగింది. కాని ఏమైంది… మూవీ మటాష్..

తెలుగు మార్కెట్లోనే కాదు, హిందీ, కన్నడ మార్కెట్ లో కూడా వెట్టయాన్ కి పంచ్ పడింది. అంతే రిలీజ్ అయిన రెండు మూడు రోజుల్లోనే దుకానం సర్ధేసే పరిస్థితి వచ్చింది. కాబట్టే, ఇప్పుడు ఓటీటీలో సేమ్ సీన్ రిపీట్ కావొద్దనుకున్నారో ఏమోకాని, అంతా సీనియర్ స్టారైనా కాని, వెట్టయాన్ ని దేవర స్ట్రీమింగ్ అయ్యే రోజుకాకుండా, ముందు రోజు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. ఇది నిజంగా తారక్ ఫ్యాన్స్ కే కాదు, సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి కూడా షాకయ్యేలా చేసిన నిర్ణయం…ఏదైనా వెట్టయాన్ మాత్రం దేవర జోరు గ్రహించే వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది.