ఎవరీ సిరి లేళ్ళ, నారా రోహిత్ తో ఆమె ఏజ్ గ్యాప్ తెలుసా…? అసలు ఎలా కనెక్ట్ అయింది…

ఎట్టకేలకు నారా వారి హీరో రోహిత్ ఓ ఇంటి వాడు అవుతున్నాడు. ఇన్నాళ్ళు ఫ్యామిలీ సమస్యలు, అలాగే సినిమాలతో కాస్త బిజీగా గడిపిన ఈ హీరో ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. తనతో పాటు ప్రతినిధి 2 అనే సినిమాలో నటించిన సిరి లేళ్ళ తో ఆయన వివాహం జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - October 14, 2024 / 10:40 AM IST

ఎట్టకేలకు నారా వారి హీరో రోహిత్ ఓ ఇంటి వాడు అవుతున్నాడు. ఇన్నాళ్ళు ఫ్యామిలీ సమస్యలు, అలాగే సినిమాలతో కాస్త బిజీగా గడిపిన ఈ హీరో ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు. తనతో పాటు ప్రతినిధి 2 అనే సినిమాలో నటించిన సిరి లేళ్ళ తో ఆయన వివాహం జరుగుతోంది. నారా రోహిత్ పెళ్లి గురించి అసలు మీడియాలో ఏ మాత్రం హడావుడి లేకుండా నిశ్చితార్ధం హైదరాబాద్ లో నిర్వహించారు కుటుంబ సభ్యులు. దీనితో అసలు ఆ అమ్మాయి ఎవరు, ఏం చదువుకుంది అనే విషయాలు ఆసక్తిగా మారాయి.

సిరి లేళ్ళ.. కరీంనగర్ కు చెందిన అమ్మాయి. ఆ అమ్మాయి హైదరాబాద్ లోనే చదువుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి మాస్టర్స్ పూర్తి చేసి ఇండియా వచ్చి జాబ్ చేయాలి అనుకుంది. కాని సినిమాల మీదున్న ఆసక్తితో ఆమె అక్కడ ఉన్నప్పుడే పలు షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించి మెప్పించింది. ఇక డబ్ స్మాష్, టిక్ టాక్ ల్లో సహా పలు వీడియోలు కూడా చేసింది. అయితే ఇండియా వచ్చిన తర్వాత సినిమాల్లో హీరోయిన్ కావాలి అనుకుని కుటుంబ సభ్యులను ఒప్పించింది. ముందు కుటుంబ సభ్యులు నో చెప్పారట.

అసలు మనకు సినిమాలు ఏ మాత్రం సెట్ అవ్వవు అని సినిమాల్లో నటించవద్దు అని చెప్పడంతో అసలు మీరు ఎక్కడా తల దించుకునే విధంగా సినిమాలు చేయను అని ఆమె హామీ ఇచ్చారట. ఓ రెండేళ్ళ పాటు సినిమాల కోసం ప్రయత్నం చేసి అవకాశాలు రాకపోతే కచ్చితంగా జాబ్ చేసుకుంటా అని చెప్పిందట. అదే సమయంలో ఆమెకు… నారా రోహిత్, జర్నలిస్ట్ మూర్తి చేస్తున్న సినిమా గురించి తెలిసింది. దీనితో ఆ సినిమాలో ట్రై చేయగా నారా రోహిత్ కూడా ఓకే చెప్పాడు ఆమెకు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి… అది నారా రోహిత్ తన క్లోజ్ ఫ్రెండ్ శ్రీ విష్ణుకి చెప్పాడట.

ముందు భయపడినా శ్రీ విష్ణు సలహాతో ఆమెతో మాట్లాడగా ఆమె కూడా ఓకే చెప్పారట. అసలు నారా కుటుంబంలోకి కోడలు అంటే ఆ రేంజ్ వేరు అని ఆమె కుటుంబ సభ్యులు కూడా చెప్పడంతో ఆమె వెనకడుగు వేయలేదట. ఇక శిరీష కుటుంబ సభ్యులతో నేరుగా నారా భువనేశ్వరి చర్చలు జరిపారట. దీనితో వాళ్ళు ఏ కండీషన్ లు పెట్టకుండా ఆమెకు ఓకే చెప్పేశారు. ఇలా నారా వారి కుటుంబానికి సిరీ లేళ్ళ కోడలు అయింది. ఇంతకు ఆమె పేరు శిరీష లేళ్ళ. నారా రోహిత్ వయసు 39 ఏళ్ళు కాగా ఆమె వయసు 28 ఏళ్ళు. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 11 ఏళ్ళట.