Mahesh Babu: సంక్రాంతికి పెద్ద పుంజుతో పోటీ పడుతున్న పిల్ల పుంజులు

అందరూ సంక్రాంతిపైనే కర్చీఫ్‌లు వేసేశారు. పండక్కి ఎన్ని సినిమాలు వచ్చినా.. తగ్గేదే లేదన్నారు. ఇలా 2024 సంక్రాంతికి అరడజను సినిమాలు తేలాయి. చివరికి మిగిలింది నాలుగే..అందులో స్టార్‌ హీరో ఒక్కడే.

  • Written By:
  • Publish Date - August 22, 2023 / 08:08 AM IST

ఏ హీరోని కదిలించినా.. సంక్రాంతేనన్నాడు. మహేశ్‌ గుంటూరు కారం.. ప్రభాస్‌ కల్కి.. రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’.. పవన్‌కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’ సంక్రాంతినే టార్గెట్‌ చేశాయి. అనుకున్న టైంలో షూటింగ్‌ పూర్తికాకపోవడంతో.. ఒక్కొక్కటీ డ్రాప్‌ అవుతూ వచ్చాయి. చివరికి మహేశ్‌ ఒక్కటే మిగిలాడు. గుంటూరు కారం షూటింగ్‌ ఇప్పటివరకు సగం కూడా పూర్తికాలేదు. నాలుగు నెలల్లో సినిమాను ఎలా పూర్తిచేస్తారు? సంక్రాంతికి కష్టమే అనుకుంటే.. మహేశ్‌ రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో సంక్రాంతికే వస్తామని చెప్పడంతో గుంటూరు కారంపై వున్న డౌట్స్‌.. కన్‌ఫ్యూజన్‌కు తెరపడింది.

సంక్రాంతికి వస్తామన్న గేమ్‌ ఛేంజర్‌.. కల్కి చేతులెత్తేశాయి. గేమ్‌ ఛేంజర్‌ తీస్తున్న శంకర్‌ మరోవైపు భారతీయుడు2పై దృష్టిపెట్టాడు. దీంతో గేమ్‌ ఛేంజర్‌ సమ్మర్‌కు వెళ్లిపోయింది. అప్పటికీ పూర్తికాకపోతే.. ఆగస్ట్‌లో వస్తుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ పూర్తికాక కల్కి వాయిదాపడింది. అందుకే.. గ్లిమ్స్‌లో సంక్రాంతి డేట్‌ జనవరి12ను ఎనౌన్స్‌ చేయలేదు. గేమ్‌ ఛేంజర్‌.. కల్కీ తప్పుకోవడంతో రవితేజ పందెంకోడిలా దూకేశాడు. మాస్‌ రాజా నటిస్తున్న ఈగిల్‌ సంక్రాంతికి వస్తోంది. సినిమాటోగ్రాఫర్ కార్తీక్‌ ఘట్టమనేని డైరెక్ట్‌ చేస్తున్న ఈ సినిమాను పీపుల్స్‌ మీడియా నిర్మిస్తోంది. కొత్త షెడ్యూల్‌ కోసం.. లండన్‌ వెళ్తున్న రవితేజ వీడియో నెట్‌లో వైరల్‌ అవుతోంది.

కల్కి రాదని ముందే తెలియడంతో.. హనుమాన్‌ను సంక్రాంతికి తీసుకొచ్చేశారు. తేజ్‌ సజ్జా హీరోగా.. ప్రశాంత్‌ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్‌ ఆల్రెడీ షూటింగ్‌ పూర్తి చేసుకుని.. జనవరి 12న థియేటర్స్‌లోకి వస్తోంది. 2024 సంక్రాంతికి వస్తున్న స్టార్‌ హీరో మహేశ్‌ ఒక్కడే అయినా..క్రేజీ ప్రాజెక్ట్స్‌ సూపర్‌స్టార్‌కు గట్టి పోటీ ఇస్తున్నాయి. గీత గోవిందం తర్వాత విజయ్‌, పరశురామ్‌ కాంబో రిపీట్‌ అవుతోంది. దిల్‌ రాజు నిర్మాత. సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నాట్టు.. షూటింగ్‌ మొదలుకాకుండానే.. ప్రకటించడం విశేషం. గుంటూరు కారం మొదలుకాకుండానే.. డిజిటల్‌ బిజినెస్‌ పూర్తిచేసుకుందంటే.. సినిమాకు ఎంత హైప్‌ వుందో అర్థమవుతోంది. గీత గోవిందం కాంబో రిపీట్ అంటే.. భారీ అంచనాలే వుంటాయి. టీజర్‌తో హనుమాన్‌ స్థాయి పెరిగిపోయింది. టీజర్‌తో ఈగిల్‌ ఆకట్టుకుంది. మరి ఇన్ని ప్రాజెక్ట్స్‌కు వాటి క్రేజ్‌కు తగ్గట్టు థియేటర్స్ దొరుకుతాయా? అంటే కష్టమే. సంక్రాంతి బరిలో సోలోగా ముందు దిగే సినిమాకు మాత్రమే భారీ ఓపెనింగ్స్‌ దక్కుతాయి. ఆతర్వాత థియేటర్స్‌ పంచుకోవాల్సిందే.