Kalki song : గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘థీమ్ ఆఫ్ కల్కి’.

ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 AD' పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా విడుదలైన "థీమ్ ఆఫ్ కల్కి" ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది.

 

 

ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా విడుదలైన “థీమ్ ఆఫ్ కల్కి” ఆ అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది. గూస్ బంప్స్ అనే దానికి పర్యాయపదంలా ఈ సాంగ్ ఉందని చెప్పవచ్చు.

సంతోష్ నారాయణన్ స్వరకర్తగా వ్యవహరిస్తున్న ‘కల్కి’ నుంచి ఇటీవల “భైరవ యాంతం” విడుదలై ఆకట్టుకుంది. తాజాగా “థీమ్ ఆఫ్ కల్కి”ని విడుదల చేశారు మేకర్స్. సంగీతం, సాహిత్యం, గానం అన్నీ చక్కగా కుదిరి.. ఈ పాట అద్భుతంగా ఉంది. ముఖ్యంగా చంద్రబోస్ అందించిన సాహిత్యం ఈ పాటకు ప్రధాన బలంగా నిలిచింది.

కల్కి అవతారము, దశావతారములలో పదవ అవతారము అని హిందువుల విశ్వాసము. కలియుగాంతములో విష్ణువు కల్కిగా అవతరించనున్నట్లు భావిస్తారు. దశావతారాలను ప్రస్తావిస్తూ కల్కి గురించి చంద్రబోస్ రాసిన ప్రతి లైన్ ఎంతో పవర్ ఫుల్ గా ఉంది. సింగర్స్ కాల భైరవ, అనంతు, గౌతమ్ భరద్వాజ్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఈ పాటను ఆలపించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన ‘కల్కి’లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే తదితరులు నటించారు. ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.