Extra Ordinary Man Review: నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ హిట్ కొట్టినట్టేనా..!

కమర్షియల్ ఫార్ములానే ఎంచుకొని కామెడీ యాంగిల్ ని టచ్ చేస్తూ అనుకున్న కథని స్ట్రైయిట్ గా చెప్పే ప్రయత్నం చేశాడు.అయితే కథలో ఫాల్ట్ లేకపోయిన కూడా డైరెక్షన్ లో దర్శకుడు కొన్ని తప్పులు అయితే చేశాడు. స్ట్రైయిట్ ఫార్వార్డ్ గా కాకుండా స్క్రీన్ ప్లే మార్చి సినిమా తీసి ఉంటే ఇంకా బాగుండేది.

  • Written By:
  • Updated On - December 8, 2023 / 01:25 PM IST

Extra Ordinary Man Review: బాక్పాఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలం అవుతున్న హీరోలలో ఒకరు నితిన్. తాజాగా ఈ యువ హీరో నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చిన కొత్త సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్. మరి.. ఈ సినిమాతో నితిన్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడా..? వక్కంతం వంశీ రెండో సినిమాతో సక్సెస్ సాధించాడా..? అనే విషయాలు తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే. కథ విషయానికి వస్తే ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా ముందుకు వెళ్తున్న నితిన్ కి శ్రీలీలా పరిచయం అవుతుంది.

CM REVANTH REDDY: యశోద హాస్పిటల్‌లో కేసీఆర్.. సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు..

ఆమెతో ప్రేమలో పడి అలా తన ప్రేమ ని కొనసాగిస్తూ నితిన్ ముందుకెళ్తూ ఉంటాడు.ఇక వాళ్ళ నాన్న అయిన రావు రమేష్ నితిన్ ని ఎప్పుడు తిడుతూ పని మీద ధ్యాస ఉండదు అని గొడవ పడుతూ ఉంటాడు. నితిన్ మాత్రం అవన్నీ లైట్ గా తీసుకుంటూ అటు జూనియర్ ఆర్టిస్ట్ గా చేసుకుంటూ, ఇటు శ్రీలీలా తో ప్రేమ ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి సమయంలోనే నితిన్‌కి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ కి ముఖ్య కారణం ఎవరు అనేది తెలుసుకొని అతనితో ఢీ కొట్టి తన ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకున్నాడా.. లేదా అనేదే ఈ సినిమా. పర్పామెన్స్ టెక్నికల్ విషయాలకు వస్తే.. ఈ సినిమా స్టోరీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల స్టోరీ లానే ఉంటుంది. కానీ కొన్ని ట్విస్ట్‌లతో దర్శకుడు ఈ సినిమాకి వేరే లెవెల్ ని క్రియేట్ చేశాడు. ముఖ్యంగా వక్కంతం వంశీ అందించిన కథలలో డెప్త్ చాలా ఎక్కువగా ఉంటుంది. కమర్షియల్ ఫార్ములానే ఎంచుకొని కామెడీ యాంగిల్ ని టచ్ చేస్తూ అనుకున్న కథని స్ట్రైయిట్ గా చెప్పే ప్రయత్నం చేశాడు.అయితే కథలో ఫాల్ట్ లేకపోయిన కూడా డైరెక్షన్ లో దర్శకుడు కొన్ని తప్పులు అయితే చేశాడు. స్ట్రైయిట్ ఫార్వార్డ్ గా కాకుండా స్క్రీన్ ప్లే మార్చి సినిమా తీసి ఉంటే ఇంకా బాగుండేది. అలాగే డైరెక్షన్ లో ఇంకొంచెం షార్ప్ నెస్ పెంచుంటే బాగుండేది అనిపిస్తుంది.

ఇక ఫస్ట్ సినిమా నేర్పిన పాఠంతో ఆ సినిమాలో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా చూసుకున్నప్పటికీ ఈ సినిమాలో మరికొన్ని కొత్త తప్పులను కూడా వక్కంతం వంశీ చేశాడు. ఈ సినిమాలో కొన్ని సీన్లు ఎక్స్ ట్రా ఆర్డినరీ అనే విధంగా ఉంటాయి. అందులో నితిన్ కూడా తనదైన రీతిలో కొన్ని సీన్లలో టాప్ నాచ్‌లో పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇక శ్రీలీల గ్లామర్ వరకు పరిమితమైంది. ఇంతవరకూ హీరోగా మాత్రమే చేస్తూ వచ్చిన రాజశేఖర్, ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రను చేయడం అదనపు ఆకర్షణగా మారింది. ఓవరాల్‌గా కామెడీని ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చుతుంది.