ఎట్టకేలకు సమంత (Samantha) కు ఓ ఛాన్స్ దక్కింది. ఈ ఆఫర్ కోసం.. దాదాపు మూడేళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే.. ఈ అమ్మడి రెమ్యునరేషన్ అనూహ్యంగా పడిపోయింది. ఒకప్పుడు మూడు కోట్లు డిమాండ్ చేసిన ఈ బ్యూటీ రెమ్యునరేషన్ ప్రస్తుతం కోటి కూడా లేదు. సమంత ఖుషి మూవీ ఓకే చేసి మూడేళ్లు దాటింది. 2023లో ఫొటోషూట్ నిర్వహించి షూటింగ్ స్టార్ట్ చేశారు. సామ్ (Sam) మధ్యలో మయోసైటిస్‌తో బాధపడడంతో షూటింగ్ ఆగిపోయింది. గతేడాది సెప్టెంబర్‌లో ఖుషీ (Khushi) రిలీజైంది. అంటే దాదాపు మూడేళ్లు మరో సినిమా ఛాన్స్ దక్కలేదు. ఆ మధ్య సామ్ బర్త్‌డే (Sam’s birthday) సందర్భంగా తనే నిర్మాతగా మారిన.. మా ఇంటి బంగారం’ మూవీని ఎనౌన్స్ చేసినా.. దీని కంటే ముందే మరో మూవీ షూటింగ్‌లో జాయిన్ అయింది.
14ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళం తప్ప మరో లాంగ్వేజ్ చేయని సామ్.. మలయాళంలోకి అడుగుపెట్టింది. కెరీర్ మొదట్లో సూపర్‌హిట్ ఏ మాయ చేసావె ఇచ్చిన గౌతమ్ మీనన్ (Gautham Menon) మలయాళంలో మమ్ముట్టితో మూవీ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా.. కలిసొచ్చిన సామ్‌నే తీసుకున్నాడు. మొత్తానికి గౌతమ్ మీనన్ ఆశీస్సులతో సామ్ ఛాన్స్ కొట్టేసింది. సొంత సినిమా మా ఇంటి బంగారం షూటింగ్ మొదలుకాకుండానే.. ముందుగా బయట సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మలయాళ సూపర్‌స్టార్ పక్కన ఛాన్స్ అన్న పేరేగానీ.. సామ్ రెమ్యునరేషన్ తక్కువే. తెలుగు, తమిళంతో పోల్చుకుంటే.. మలయాళంలో రెమ్యునరేషన్స్ చాలా తక్కువ.
ఈ లెక్కన రెండు, మూడు కోట్ల మధ్యలో వున్న సామ్ మలయాళ మూవీ కోసం కోటి కంటే తక్కువే తీసుకుంటోందట. అయితే.. అన్ని సినిమాల్లా ఇందులో లెంగ్తీ రోల్ కాదని.. 15, 20 రోజులు షూటింగ్‌తో పూర్తవవుతుందని తెలిసింది. ఎట్టకేలకు మూడేళ్ల తర్వాత సినిమా ఛాన్స్ అందుకుంది సామ్. దాదాపు ఏడాది తర్వాత కెమెరా ముందుకొస్తోంది. ఇంతకాలం సినిమాల్లేవన్న మాటే గానీ.. ఏదో ఒక స్టిల్, వీడియోతో ఇన్‌స్టాను హీట్ ఎక్కిస్తూనే వుంటోంది. ఇక నుంచి సినిమా విశేషాలు చెబుతుందేమో చూడాలి మరి.