FAMILY STAR: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 200 కోట్ల వసూళ్లను ఎన్నటికైనా సాధిస్తా అన్నాడు. కాని ఫ్యామిలీ స్టార్ మూవీతోనే ఆ వసూళ్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. అయినా 200 కోట్ల వసూళ్లు విజయ్ స్టామినాకు పెద్ద నెంబరే కాదు. అర్జున్ రెడ్డికి 50 కోట్ల కలెక్షన్స్ వస్తే, గీత గోవిందం మూవీకి రూ.130 కోట్ల వసూళ్లొచ్చాయి. ఇమేజ్ లేని టైంలో వచ్చిన సినిమాలకే అన్ని కలెక్సన్స్ వస్తే, ఇప్పడు రౌడీ రేంజ్ పెరిగింది. పాన్ ఇండియా లెవల్లో హిట్ పడకున్నా, తనుకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది.
ALLU ARJUN-RAM CHARAN: చరణ్-అర్జున్.. అల్లు అరవింద్ డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలుకానుందా..?
కాబట్టి ఫ్యామిలీ స్టార్ ఏమాత్రం బాగుందనే టాక్ తెచ్చుకున్నా ఈజీగా 200 కోట్లేంటి.. 300 కోట్ల వసూళ్లు కూడా పెద్ద మ్యాటర్ కాదు. టాలీవుడ్‌లో హనుమాన్ మూవీతో 350 కోట్ల వసూళ్లు రాబట్టి తేజ, 250 కోట్ల వసూళ్లు రాబట్టి కార్తికేయ 2తో నిఖిల్ కూడా ఎప్పుడో ఆ నెంబర్ దాటారు. కాబట్టి, ఇదేం పెద్ద టార్గెట్ అనుకునేంత నెంబర్ కాదు. విజయ్ దేవరకొండ రేంజ్‌కి, యూత్‌లో ఉన్న క్రేజ్‌కి, అర్జున్ రెడ్డి లాంటి మూవీ పడితే వెయ్యికోట్లు, గీత గోవిందంలాంటి సినిమా పడితే రూ.500 కోట్లు వచ్చే సీన్ ఉంది.
మార్కెట్‌లో అంత సౌండ్ కూడా వస్తోంది. కేవలం లైగర్‌తో పంచ్ పడటంతోపాటు తన ప్రతీ మూవీ రిలీజ్‌కి ముందు కుమ్మేస్తాం, దుమ్ముదులిపేస్తాం లాంటి స్టేట్‌మెంట్లు ఇస్తే కాలం కలిసి రాలేదు. అందుకే కావాలని వెయ్యికోట్ల రేంజ్ ఉన్న స్టార్ 200 కోట్ల కలెక్షన్ల కలలే కంటున్నట్టున్నాడు.