FAMILY STAR: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సక్సెస్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న మాస్ అండ్ ఫ్యామిలీ డ్రామా చిత్రం ఫ్యామిలీ స్టార్. గీతగోవిందం లాంటి మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న కాంబో కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగట్టే ఇటీవల విడుదలైన టీజర్, పాటలు అదరగొట్టాయి. ముఖ్యంగా పాటలపై అయితే మ్యూజిక్ లవర్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్గా రిలీజైన కల్యాణి వచ్చా వచ్చా అంటూ సాగే పెళ్లి సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.
SS RAJAMOULI: జక్కన్న అసూయ.. వాళ్లంటే రాజమౌళికి జెలసీ..!
ప్రజెంట్ పాన్ ఇండియా రేంజ్లో పెళ్లిళ్ల ట్రెండ్ నడుస్తున్న టైంలో పాటను రిలీజ్ చేయడంతో మరింత హైప్ క్రియేట్ చేసుకుంది. ఇదిలా ఉంటే విజయ్, పరుశురాం కాంబినేషన్ ఖాతాలో మరో డీసెంట్ హిట్ పడటం ఖాయమని చాలా మంది అనుకుంటున్నారు. సినిమా విడుదలై, మంచి విజయం దక్కించుకోవడం ఖాయమేగానీ, ప్రతికూల పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రౌడీ హీరో మరోసారి రిస్క్ చేస్తున్నాడా అన్న చర్చలు ఇండస్ట్రీలో నడుస్తున్నాయి. తెలుగురాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తోంది. అటు ఏపీలో, ఇటు తెలంగాణలోనూ రాజకీయం రంజుగా సాగుతోంది. ఎన్నికలు అంటేనే సినిమాలకు గడ్డుకాలం అని గతంలో చాలాసార్లే రుజువైంది. ఇక ఇదే సమయంలో ఐపీఎల్ సందడి కూడా ఉంటుంది. దీని ఎఫెక్ట్ సినిమాలపై గట్టిగానే ఉంటుంది. అందుకే చాలా మంది నిర్మాతలు తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకున్నారు. కానీ అవేవి తమకు మ్యాటర్ కాదంటూ ఫ్యామిలీ స్టార్ టీమ్ ఆడియన్స్ ముందుకు వస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది.
ఫ్యామిలీ ఆడియన్సే టార్గెట్‌గా సినిమా ప్రమోషన్స్ రిలీజ్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికలు, ఐపీఎల్ ఉన్నప్పటికీ సినిమా లవర్స్ ఆదరిస్తారని గట్టి నమ్మకం పెట్టుకున్నారు. మరోవైపు ఈ సమయంలో మరో భారీ సినిమా ఏదీ పోటీలో లేకపోవడం తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి గతంలో ఈ సినిమా వాయిదా వేసే అవకాశముందని ప్రచారం జరిగింది. కానీ తాజాగా ముందుగా ప్రకటించినట్లుగానే ఏప్రిల్ 5నే ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. చూడాలి మరి పరిస్థితులతో పోటీపడుతున్న వీరికి ఎలాంటి ఫలితం వస్తుందో.