Suriya: వాటే కాంబో.. అదిరింది గురూ.. సూర్యతో టాలీవుడ్ డైరెక్టర్..!

కార్తికేయ-2తో పాన్ ఇండియా హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ చందు మొండేటి.. సూర్యతో మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే నాగచైతన్యతో ఓ మూవీ చేస్తున్న ఈ డైరెక్టర్.. ఇప్పుడు మరో మూవీని లైన్‌లో పెట్టాడు. దీంతో ఈ రెండు సినిమాలకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడట చందు.

  • Written By:
  • Publish Date - August 23, 2023 / 04:30 PM IST

Suriya: అసలు ఊహించని కాంబో సెట్స్ పైకి రావడం టాలీవుడ్, కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సింగం స్టార్ సూర్య.. టాలీవుడ్ డైరెక్టర్‌తో జతకట్టడం సెన్సేషన్‌గా మారింది. పైగా అదిరిపోయే బ్యాక్ డ్రాప్‌లో అలరించేందుకు చర్చనీయాంశంగా మారింది. కార్తికేయ-2తో పాన్ ఇండియా హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ చందు మొండేటి.. సూర్యతో మూవీ చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే నాగచైతన్యతో ఓ మూవీ చేస్తున్న ఈ డైరెక్టర్.. ఇప్పుడు మరో మూవీని లైన్‌లో పెట్టాడు.

దీంతో ఈ రెండు సినిమాలకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడట చందు. నాగచైతన్య సినిమా కోసం జాలర్ల లైఫ్ స్టైల్ మీద రీసర్చ్ చేస్తున్న చందు, సూర్యతో చేయబోయే సినిమా కోసం ఇంట్రస్టింగ్ బ్యాక్డ్రాప్‌లో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. వేదాల బ్యాక్‌డ్రాప్‌లో ఒక లైన్‌ని ఇప్పటికే సూర్యకి వినిపించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సూర్య ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ స్క్రిప్ట్ గురించి అడిగి తెలుసుకుంటున్నాడట. ప్రస్తుతం కంగువా సినిమాతో బిజీగా ఉన్న సూర్య.. ఆ తర్వాత వెట్రిమారన్ డైరెక్షన్లో ఒక సినిమాతో పాటు మరో ప్రాజెక్ట్‌ని కూడా లైన్లో పెట్టాడు. కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక చందు మొండేటి సినిమా స్టార్ట్ అవ్వటానికి మినిమమ్ రెండేళ్లు పట్టే అవకాశం ఉంది గనక ఈ గ్యాప్‌లో నాగచైతన్య సినిమా కంప్లీట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు చందు.

పాన్ ఇండియా సినిమాగా రూపొందనున్న ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా తన సత్తా చాటాలని భావిస్తున్నాడట చందు మొండేటి. ప్రస్తుతం కంగువా లాంటి పీరియాడిక్ సినిమా చేస్తున్న సూర్య, వేదాల బ్యాక్‌డ్రాప్‌లో మరో డిఫరెంట్ స్టోరీని లైన్లో పెట్టాడు. ఈ సినిమాలతో సూర్య పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందటం ఖాయం అని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.