65 ఏళ్ళ వయసులో నాగ్ ఫిట్నెస్ కు ఫ్యాన్స్ ఫిదా

అక్కినేని కుటుంబం వరుస పెళ్లిళ్లతో ఇప్పుడు సందడి సందడిగా ఉంది. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ చూసినా అక్కినేని ఫ్యామిలీ ఫోటోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య, శోభిత వివాహం సోషల్ మీడియాను ఊపేస్తుంది.

  • Written By:
  • Publish Date - December 9, 2024 / 01:15 PM IST

అక్కినేని కుటుంబం వరుస పెళ్లిళ్లతో ఇప్పుడు సందడి సందడిగా ఉంది. సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ చూసినా అక్కినేని ఫ్యామిలీ ఫోటోలే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య, శోభిత వివాహం సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఇక అఖిల్, జైనాబ్ నిశ్చితార్దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇలా ఇంట్లో వరుస పెళ్లిళ్లతో అక్కినేని హీరోలు బిజీ బిజీగా గడుపుతున్నారు. సినిమాలను పక్కనపెట్టి ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ తో టైం స్పెండ్ చేస్తున్నారు అక్కినేని హీరోలు.

నాగార్జున ఒకవైపు బిగ్ బాస్ షో తో బిజీగానే ఉంటూ మరోవైపు ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ అలాగే వ్యాపారాలతో హడావుడిగా గడుస్తున్నారు. టాలీవుడ్ లో నాగార్జునకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. 6 పదులు వయసు దాటిన సరే నాగార్జున మెయింటైన్ చేసే ఫిట్నెస్ గురించి సినిమా పరిశ్రమతో పాటుగా సామాన్య జనాల్లో కూడా ఓ రేంజ్ లో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాగార్జున… నాగచైతన్య అలాగే శోభిత కలిసి శ్రీశైలం దర్శనానికి వెళ్లారు కుమారుడు వివాహం తర్వాత పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్న నాగార్జున ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

కుటుంబ సభ్యులతో కలిసి నాగార్జున శ్రీశైలం ఆలయానికి వెళ్ళగా అక్కడ ఆలయ అధికారులు గౌరవ లాంచనాలతో స్వాగతం పలికారు. ఇక ప్రత్యేక దర్శనం కూడా చేయించారు ఆలయ అధికారులు. ఇక ఈ సందర్భంగా నాగార్జున చొక్కా బదులు ఉత్తరీయం ధరించి కనిపించారు. ఆలయ ప్రాంగణంలో ఆయనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో యమా వైరల్ అవుతున్నాయి. 65 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్ ఎలా మెయింటైన్ చేస్తున్నారంటూ నాగార్జునను నెటిజన్లు కొనియాడుతున్నారు.

వాస్తవానికి నాగార్జున సినిమా పరిశ్రమతో సంబంధం లేకుండా ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. ఆయన సినిమా ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో వైరల్ అవుతూనే ఉంటాయి. డైట్ మెయింటైన్ చేయకపోయినా తాను ఉదయం చేసే ఎక్సర్సైజులే తనను అలా ఉంచుతున్నాయి అంటూ ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తన ఫిట్నెస్ సీక్రెట్ బయటపెట్టారు నాగ్. దాదాపు 35 ఏళ్ల నుంచి ఆయన అదే మెయిన్టైన్ చేస్తున్నారట. ఇక నాగార్జున జిమ్ లో ఎక్సర్సైజులు చేసే వీడియోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటాయి. స్టార్ హీరోస్ అందరితో పోలిస్తే నాగార్జున ఎక్కువగా ఫిట్ గా కనిపిస్తూ ఉంటారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లావుగా కనిపించిన్నా నాగార్జున మాత్రం ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.