OMG2: అక్షయ్ కుమార్ ఓ మై గాడ్-2 మూవీతో దండెత్తాడు. ట్రైలర్‌లో శివుడిగా కనిపించిన తను, సినిమాలో మాత్రం దేవుడి దూతగా మాత్రమే కనిపించాడు. కారణం సెన్సార్ బోర్డ్ పెట్టిన షరతు. ఇక 27 కట్లు, ఏ సర్టిఫికెట్ కలిపి ఓ మై గాడ్ 2 మూవీకి మైనస్ మార్కులు పడేలా చేశాయి. కథ విషయానికొస్తే, తన కొడుక్కి స్కూల్ వల్ల జరిగిన నష్టం ఎవరికీ జరక్కూడదని సెక్స్ ఎడ్యుకేషన్ విషయంలో ఫైట్ చేస్తాడు పిల్లాడి తండ్రి. తనకి దేవ దూతగా అక్షయ్ తోడుగా నిలిస్తాడు. ఇక ఎప్పటిలానే మొదటి సినిమా ఓ మై గాడ్‌లో ఉన్నట్టే ఇందులో కూడా కోర్ట్ రూమ్ డ్రామా.
ఇదే మనం గోపాల గోపాలలో చూశాం. కట్ చేస్తే అక్షయ్, పంకజ్ త్రిపాఠి పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. కాని ఓ మై గాడ్ ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే సీక్వెల్ ఆరేంజ్‌లో లేదు. ఎక్కడ ఉమేష్ శుక్లా నెరేషన్.. ఎక్కడ అమిత్ రాయ్ నెరేషన్ అనేలా సాగింది కథ, కథనం. ఇది సెక్స్ ఎడ్యుకేషన్ చుట్టూ తిరిగే కథ. అంతేతప్ప ఓ మై గాడ్‌లాగా ఆలోచింపచేసే పాయింట్లు ఇందులో తక్కువే. ఓ మైగాడ్‌లో అయితే దేవుడి పేరుతో జరిగే అన్యాయాలను ప్రశ్నించేలా కథ, కథనం సాగింది. ఓ మై గాడ్-2 మరీ ఘోరంగా లేకున్నా ఓ మైగాడ్ ఫస్ట్ పార్ట్ అంత గొప్పగాలేదనే మాటే వినిపిస్తోంది.