పవన్ కల్యాణ్ అంటే ఓ వ్యసనం అని మైక్ దొరికితే రెచ్చిపోయే బండ్ల గణేష్‌కు.. ఆయన పేరు చెప్తేనే పూనకాలు వచ్చేస్తుంటాయ్. ఎగ్జైట్‌మెంట్‌లో అలా మాట్లాడతారో, కావాలని అలా మాట్లాడతారో కానీ.. ప్రతీసారి ఈజీగా ఓ మాట జారేస్తుంటాడు బండ్ల. గతంలో చాలాసార్లు జరిగింది.. ఇప్పుడు అదే జరుగుతోంది కూడా ! పవన్ కళ్యాణ్‌కి ఫ్యాన్స్‌కి ఉంటారు.. భక్తులు ఉంటారు.. నిజమే ! ఐతే బండ్లలా జపం చేసే భక్తులు అరకొరగా మాత్రమే ఉంటారు. సందర్భం వచ్చిన ప్రతిసారి పవన్‌పై ఉన్న భక్తిని చాటుతూనే ఉంటారు బండ్ల గణేష్. వెంకన్నకు అన్నమయ్య.. శివుడికి భక్త కన్నప్ప.. రాముడికి హనుమంతుడు.. ఈ పవన్ కళ్యాణ్‌కి నేను అంటూ పవన్‌పై ఉన్న భక్తిని చాటుకుంటూనే ఉన్న బండ్ల గణేష్.. ఆ మధ్య జనసేన విషయంలో, పవన్ విషయంలో నోరుజారాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఓ టీవీ స్టూడియో డిబేట్‌లో పాల్గొన్న బండ్ల.. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాల్సిందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
నిజానికి తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు కనీసం డిపాజిట్లు రాలేదు. బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదని.. పవన్ కల్యాణ్‌కు రాజకీయాలు అవసరమా.. ఆయన పాలిటిక్స్‌కు పనికి రాడంటూ భారీట్రోలింగ్ నడిచింది. అలాంటి సమయంలో.. భ భక్తుడిగా పవన్‌ను మద్దతుగా ఉండాల్సింది పోయి.. పోటీ చేయకుండా ఉండి ఉంటే బాగుండేది అంటూ.. బండ్ల చేసిన కామెంట్లు.. పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించాయ్. ఐతే ఆ తర్వాత ఆ వివాదం ఏదోలా సద్దుమణిగింది. ఇప్పుడు మళ్లీ రచ్చ స్టార్ట్ అయింది. గబ్బర్ సింగ్ రి రిలీజ్ అని.. మూవీ టీమ్ ఓ ప్రెస్‌మీట్ పెట్టింది. ఐతే పవన్ భక్తుడు అని చెప్పుకునే మీరు.. పవన్‌ను ఎందుకు విమర్శించారు అంటూ.. ఓ రిపోర్టర్ క్వశ్చన్ అడగ్గా.. బండ్లన్న కోపంతో ఊగిపోయాడు. ప్రాణం పోయినా తాను పవన్‌ను విమర్శించనని.. అధికారంలో ఉంటే ఒకలా, లేకుంటే మరోలా మాట్లాడే స్వభావం తనది కాదని.. వైరల్ అవడానికి ఇలాంటి కామెంట్లు చేయడం కరెక్ట్ కాదు అంటూ.. ఓవరాక్షన్ చేశాడు బండ్ల. కట్ చేస్తే.. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ బండ్ల చేసిన వ్యాఖ్యల వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఊపు మీదున్నాం.. ఊగిపోతున్నామని.. ఏది పడితే అది మాట్లాడడం కాదు బండ్ల.. నోరు అదుపులో పెట్టుకో.. ఈ నోటి దూల కాస్త తగ్గించుకో అంటూ.. సోషల్ మీడియాలో సలహాలు ఇస్తున్నారు బండ్లన్నకు !