ఎన్నో అంచనాల మధ్య రిలీజైన మిస్టర్ బచ్చెన్.. చాలా సింపుల్‌గా ఆడియన్స్ గుండెల్లో గుచ్చెశాడు. మిరపకాయ్ లాంటి హాట్ హిట్ తరువాత మళ్లీ హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడంతో రవన్న ఫ్యాన్స్ ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. దాదాపు ఐదేళ్ల తరువాత హరీష్ సినిమా తీస్తుండటంతో కామన్ ఆడియన్స్‌లో కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలను 30 శాతం కూడా రీచ్ అవ్వలేకపోయాడు హరీష్ శంకర్. రైడ్ అనే హిందీ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా చేశారు. కథను కాపీ కొట్టడం తప్పు కాదు.. దాన్ని మన స్టైల్‌లో ఆడియన్స్‌కు నచ్చేలా ప్రజెంట్ చేయలేకపోవడం తప్పు.
అదే తప్పు ఈ సినిమాతో చేశాడు హరీష్ శంకర్. ఈ సినిమాలో అంతా మ్యూజిక్ లవర్స్. అసలు సినిమాలో పాటలు ఉన్నాయా లేక పాటల మధ్య సినిమా వస్తుందా కూడా అర్థం కానన్ని పాటలు ఈ సినిమాలో పెట్టారు. కాదు కాదు ఇరికించారు. ఫస్ట్ హాఫ్ అంతా ఇదే సొల్లు. ఇక సెకండ్ హాఫ్‌లో ఐనా మాంచి యాక్షన్, పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనుకుంటే. అది కూడా అలాగే చప్పగా లాగదీశాడు. ఆఖరికి చాలా గంభీరంగా కనిపించాల్సిన విలన్ క్యారెక్టర్‌ను కూడా చాలా సింపుల్‌గా ఏవో పాటలు పాడుతూ ఇంట్రడ్యూస్ చేయడంతో ఆడియన్స్‌కి సినిమా మీద ఉన్న మూడ్, ఉత్సాహం సర్వనాశనం అయ్యింది.
ఇదంతా ఒకలా ఉంటే ఈ సినిమాకు ముందు హరీష్ శంకర్ చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. ప్రతీ ప్రెస్ మీట్‌లో జర్నలిస్ట్‌లను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన కామెంట్లు, చూపించిన యాటిట్యూట్ వేరే లెవెల్. చాలా మంది జర్నలిస్ట్‌లను నేరుగానే మాటలు అంటూ తనను మించిన డైరెక్టర్ లేడు అన్నట్టుగా ప్రెస్‌మీట్లు, ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. కట్ చేస్తే.. మిస్టర్ బచ్చన్ రిజల్ట్ ఇది. దీంతో ఇప్పుడు సినిమా చూసిన ఫ్యాన్స్ అంతా.. ఏంది అన్నా మొన్న ఏదో మాట్లాడావు ఈ సినిమా గురించేనా అంటున్నారు. సినిమా కాపీ కొట్టడం కూడా రాకపోతే ఎలాగయ్యా అంటూ తిట్టిపోస్తున్నారు. ఇక ఈ సినిమా మీద హోప్స్ పెట్టుకున్న ఫ్యాన్స్ ఐతే డైరెక్టర్ కనిపిస్తే కొట్టేలా ఉన్నారు. వీలైతే ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దిక్కు వెళ్లకండి అంటూ ఆడియన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు.