ఇప్పుడు రీసెంట్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన కూడా ఇలాగే ఓ యాడ్‌లో నటించి ట్రోలింగ్ ఎదర్కుంటోంది. రీసెంట్‌గా ఓ ఫ్రైడ్ చికెన్, బర్గర్ యాడ్‌లో నటించింది రష్మిక. యాడ్‌లో చికెన్ లెగ్‌పీస్ తింటూ కనిపించింది. ఈ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో కూడా పోస్ట్ చేసింది. ఇలా వీడియో పెట్టిందో లేదో.. అలా ఆడుకోవడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. ఎందుకంటే రష్మిక వెజిటేరియన్. ఈ విషయాన్ని తానే చాలాసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పింది. తాను నాన్‌వెజ్ ఇప్పటి వరకూ తినలేదని.. ఇక ముందు కూడా తినబోనంటూ చెప్పింది. కానీ ఇప్పుడు మాత్రం యాడ్ కోసం చికెన్ తింటూ కనిపించింది. దీంతో నెటిజన్లు చిర్రెత్తిపోయారు.
డబ్బు కోసం ఏమైనా చేస్తావా అంటూ పెద్ద పెద్ద కామెంట్లు పెడుతున్నారు. నీ యాడ్ కోసం ఆడియన్స్‌ను తప్పు దారి పట్టిస్తున్నావంటూ రష్మికకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్నారు. గతంలో ఆలియా భట్ కూడా ఐస్, కూల్‌డ్రింక్, బిస్కెట్ యాడ్స్ చేసి ట్రోల్స్‌కు గురైంది. తాను ఎప్పుడు యాడెడ్ షుగర్ ఉన్న వస్తువులు తినలేదని.. నేచురల్ స్వీట్‌ను మాత్రమే తీసుకుంటానని చెప్పింది ఆలియా. ఈ విషయంలో తాను చాలా పర్ఫెక్ట్‌గా ఉంటానని చెప్పింది. కానీ తరువాత యాడ్స్ కోసం కూల్ డ్రింక్ తాగుతూ, చాక్లెట్స్ తింటూ నటించింది. దీంతో అప్పుడు ఆలియను కూడా ఓ రేంజ్‌లో ఆడుకున్నారు నెటిజన్లు. ఇప్పుడు రష్మికకు కూడా సేమ్ సిచ్యువేషన్ ఎదురైంది.