JAI BHIM: జైభీమ్‌ను కాదని.. స్మగ్లర్‌కు పెద్దపీట వేస్తారా..? నేషనల్ అవార్డులపై భగ్గుమంటున్న నెటిజన్లు..

2022లో జ్ఞానవేల్‌ దర్శకత్వంలో వచ్చిన జైభీమ్‌ సినిమా విమర్శకులను సైతం మెప్పించింది. సినిమా వచ్చినప్పుడే ఈ సినిమాకు నేషనల్‌ అవార్డ్‌ పక్కా అని అంతా అనుకున్నారు. సినీవర్గాలు కూడా ఈ సినిమాకే అవార్డ్‌ వస్తుంది అని అంచనా వేశారు.

  • Written By:
  • Publish Date - August 25, 2023 / 02:10 PM IST

JAI BHIM: జైభీమ్‌.. ఈ సినిమా గురించి తెలియనివాళ్లు దాదాపుగా ఉండరు. ఎందుకంటే రిలీజ్‌ ఐన టైంలో ఈ సినిమా క్రియేట్‌ చేసిన సెన్సేషన్‌ అంతా ఇంతా కాదు. పేదలపై కొందరు పోలీసులు ఎంత కర్కశంగా వ్యవహరిస్తారు అనే పాయింట్‌తో అడ్వొకేట్‌ చంద్రు లైఫ్‌ ఆధారంగా వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో చంద్రు పాత్రలో సూర్య నటించారు. 2022లో జ్ఞానవేల్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విమర్శకులను సైతం మెప్పించింది. సినిమా వచ్చినప్పుడే ఈ సినిమాకు నేషనల్‌ అవార్డ్‌ పక్కా అని అంతా అనుకున్నారు.

సినీవర్గాలు కూడా ఈ సినిమాకే అవార్డ్‌ వస్తుంది అని అంచనా వేశారు. కానీ నిన్న ప్రకటించిన జాతీయ సినిమా అవార్డ్స్‌లో జైభీమ్‌ సినిమాకు అవార్డ్‌ రాలేదు. పుష్ప సినిమాలో నటకుగాను బెస్ట్‌ యాక్టర్‌గా అల్లు అర్జున్‌కు అవార్డు ప్రకటించారు. దీంతో అంతా షాకయ్యారు. కమర్షియల్‌ యాంగిల్‌ ఒక్కటి పక్కన పెడితే.. పుష్ప కంటే జైభీమ్‌ చాలా బెటర్‌ సినిమా. అలాంటి సినిమాలోని నటుడికి అవార్డ్‌ ఇవ్వకుండా ఎలా ఉన్నారు అనేది ఇప్పుడు అందరి డౌట్‌. కథ, కథనం, నటన జైభీమ్‌ సినిమాకు ప్రాణం. సూర్య తన రోల్‌కు ఎంత న్యాయం చేశాడో.. చిన్నతల్లి పాత్ర చేసిన లిజో మోజ్‌ జోసె కూడా అదే స్థాయి పర్ఫార్మెన్స్‌ ఇచ్చింది. ప్రతీ ఒక్కరికీ ఈ సినిమా కనెక్ట్‌ అయ్యింది. భారత రాజ్యాంగం, న్యాయ వ్యవస్థ పవర్‌ ఏంటో సినిమాలో కళ్లకు కట్టినట్టు చూపించారు.

సినిమా మొత్తం ఒకెత్తు అయితే క్లైమాక్స్‌లో సూర్యతో సమానంగా పాప కాలు మీద కాలు వేసుకుని పేపర్‌ చదివే సీన్‌ మరో ఎత్తు. ఈ ఒక్క సీన్‌కు థియేటర్స్‌లో విజిల్స్‌, క్లాప్స్‌ వర్షం కురిసింది. భారత రాజ్యంగం ముందు, న్యాయ వ్యవస్థ మందూ అంతా సమానమే అనే మెసేజ్‌ ఇచ్చే ఈ సీన్‌.. జైభీమ్‌ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. కమర్షియల్‌ సినిమాల సునామీలో కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన జైభీమ్‌ సినిమాకు ఒక్క జాతీయ అవార్డ్‌ రాకపోవడం చాలా మంది మూవీ లవర్స్‌కు నిరాశే కలిగించింది.