Balayya : దసరా బరిలో బాబాయ్, అబ్బాయ్

టాలీవుడ్‌లో సంక్రాంతి ఫైట్ ముగిసింది. సమ్మర్‌పై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. మే 9న కల్కి ఫస్ట్‌ పార్ట్‌తో ప్రభాస్ ఒక్కడే సమ్మర్ బరిలో సత్తా చాటేందుకు వస్తున్నాడు. అయితే ఈసారి దసరా ఫైట్‌ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా మారింది. బాక్సాఫీస్ దుమ్ము రేగడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా రేసులో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ రిలీజ్‌ను ఇప్పటికే లాక్‌ చేసుకున్నాడు.

టాలీవుడ్‌లో సంక్రాంతి ఫైట్ ముగిసింది. సమ్మర్‌పై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. మే 9న కల్కి ఫస్ట్‌ పార్ట్‌తో ప్రభాస్ ఒక్కడే సమ్మర్ బరిలో సత్తా చాటేందుకు వస్తున్నాడు. అయితే ఈసారి దసరా ఫైట్‌ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా మారింది. బాక్సాఫీస్ దుమ్ము రేగడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా రేసులో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ రిలీజ్‌ను ఇప్పటికే లాక్‌ చేసుకున్నాడు. అటు దసరా బరిలో అక్కినేని హీరో నాగ చైతన్య కూడా తండేల్‌గా తొడగొడుతున్నాడు. అయితే.. ఇప్పుడు దీన్ని మించిన ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్ దసరా ఫైట్‌ని ఆసక్తికరంగా మార్చేసింది. నందమూరి సీనియర్ హీరో బాలయ్య కూడా దసరా ఫైట్‌కు సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో.. ఇప్పుడు ఈ న్యూస్ వైరల్‌గా మారింది. అదే జరిగితే బాక్సాఫీస్ దగ్గర బాబాయ్ అబ్బాయ్ ఫైట్ ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆసక్తికంగా మారింది.

భగవంత్ కేసరితో వరసగా మూడో విజయం అందుకున్న బాలయ్య.. మామూలు జోరు చూపించట్లేదు. పొలిటికల్ బిజీలో ఉండి కూడా నెక్ట్స్ సినిమాను మొదలు పెట్టాడు. బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న షూటింగ్ జెట్ స్పీడుతో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం మొదలైనప్పుడు అసలు ఏప్రిల్ లోనే ఏపీ ఎన్నికల ముందు విడుదల చెయ్యాలనుకున్నారు, తర్వాత సమ్మర్ అన్నారు. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచనలు మేకర్స్ ఉన్నారట. అయితే.. ఈ సినిమా రిలీజ్ డేట్‌లో క్లారిటీ రాలేదు కానీ.. అక్టోబర్ 3న ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.. మరి ముందుగా అనుకుంటున్న ప్రకారం దేవర కూడా దసరా బరిలో దిగనుంది. ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అయ్యి అక్టోబర్ 10 దసరా పండగకి దేవర షిఫ్ట్ అయ్యింది. ట్రిపుల్ ఆర్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత వస్తున్న జూనియర్.. ఈ మూవీతో రికార్డుల ఊచకోతకు సిద్ధమవుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో దేవర, NBK109 చిత్రాలు ఓ వారం అటు ఇటుగా విడుదలైనప్పటి.. బాక్సాఫీసు ఫైట్ మాములుగా ఉండదంటున్నారు విశ్లేషకులు..

నిజానికి నందమూరి ఫ్యామిలీకి జూనియర్ ఎన్టీఆర్‌కి అంతగా మంచి రిలేషన్స్‌ లేవు.. ఇక.. బాబాయ్-అబ్బాయి కి ఫ్యామిలిలో అంతగా పొసగదన్న విషయం కూడా అందరికీ తెలిసిందే.. ఈ విషయాన్ని బలపరిచేలా ఇటీవల కాలంలో పలు సంఘటనలు కూడా జరిగాయి. అలాంటిది.. బాబాయ్-అబ్బాయ్ సినిమాలతో పోటీ పడితే ఎలా ఉంటుంది. రెండు నందమూరి సింహాలు బాక్సాఫీస్ దగ్గర బరిలోకి దిగితే ఆ లెక్క ఊహకి కూడా అండదంటున్నారు విశ్లేషకులు.. ఇప్పుడు ఈ దసరాకి అదే జరగబోతుంది అంటూ సోషల్ మీడియా మొత్తం షేకయిపోతోంది. అయితే.. నందమూరి హీరోల మధ్య దసరా బరిలో ఫైట్ పడినప్పటికీ.. అది పెద్దగా ఎఫెక్ట్ చూపదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరి సినిమాలు దసరాకే రిలీజ్ అయినప్పటికీ.. రెండు సినిమాల మధ్య వారం రోజుల గ్యాప్ ఉంటుంది కాబట్టి పెద్ద ఎఫెక్ట్ పడదంటున్నారు. బాలయ్య సినిమా హిట్ టాక్ వస్తే మొదటి వారంలో మ్యాక్సిమం కలెక్షన్లు కొట్టేస్తారు కాబట్టి.. దేవర ఎఫెక్ట్ బాలయ్య మూవీపై.. బాలయ్య ఎఫెక్ట్ జూనియర్‌పై పడే ఛాన్సే లేదంటున్నారు. చూడాలి మరి.. దసరా బరిలో నందమూరి హీరోల ఫైట్ ఎలా ఉండబోతోందో..