Pan India Stars: పాన్ ఇండియా స్టార్లకు.. వెన్నులో వణుకు తప్పట్లేదు..

వన్స్ పాన్ ఇండియా స్టార్ అయితే, ఆల్వేస్ పాన్ ఇండియా స్టారే.. అలాంటి కథలే చేయాలి.. లేదంటే అంత ఇమేజ్ ని సంపాదించి ఆవిరిచేసుకోవాల్సి వస్తుంది.. అలానే మార్కెట్ డ్యామేజ్ అవుతుంది. ఇది అచ్చంగా పులి మీద స్వారిలాంటిందే. ఆ సమస్య నుంచి ప్రభాస్ లాంటి స్టారే బయట పడలేక, చిత్ర విచిత్రమైన కథలతో ప్రయోగాలు చేస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - May 8, 2023 / 04:00 PM IST

ఇక నాని, నిఖిల్, బన్నీ అండ్ కో పరిస్థితి చెప్పక్కర్లేదు. దసరాతో పాన్ ఇండియా ట్రయల్స్ చేసిన నాని, అది టాక్ బాగున్నా, నార్త్ లో ఆడలేదని తర్వాత చేసే మూవీని సౌత్ వరకే పరిమితం చేయాలనుకుంటున్నాడు. ఇలా చేస్తే పెరిగే మార్కెట్ ని తనే తుంచేసినట్టవుతుంది. ఇక బన్నీ విషయానికొస్తే పుష్ప తో వచ్చిన పాన్ఇండియాఇమేజ్, మార్కెట్ ని కాపాడుకునేందుకు ఎంత లేటైనా పుష్ప 2 క్వాలిటీకోసం కష్టపడుతున్నాడు.. ఇదేనా పుష్ప 2 ఎలాగూ హిట్టౌతుంది కాబట్టి, ఆతర్వాత కూడా ఏం చేసినా పాన్ ఇండియా మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే చేయాలి.

అందుకే సందీప్ రెడ్డి వంగ, ప్రశాంత్ నీల్, బోయపాటి అందరిని లైన్లో పెట్టాడు. ఇక కార్తికేయ 2 తో లక్కీగా పాన్ ఇండియా హిట్ కొట్టిన నిఖిల్ పరిస్థితి మారీ ధారునం.. బన్నీ, చెర్రీ, ఎన్టీఆర్ అంటే స్టార్ హీరోలు వాళ్లకోసం స్టార్ డైరెక్టర్లు క్యూ కడతారు. కాని కార్తికేయ 2 పాన్ ఇండియా హిట్ తర్వాత పాన్ ఇండియా మూవీ చేయాలంటే, ఆరేంజ్ సినిమాలు చేసే దర్శకులు కావాలి.. ప్రతీ సారి కొత్త వాళ్లతో సరికొత్త ప్రయోగం చేస్తే కార్తికేయ 2 లెవల్లో అందర్ని మెప్పించకపోవచ్చు.. అయినా స్పై అంటూ స్వాతంత్రం యోధుడు సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీతో మూవీ చేస్తున్నాడు. అలా నార్త్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే సాహసం చేస్తున్నాడు. కాని ఇండియా లెవల్ ప్రాజెక్ట్ కి తగ్గట్టు కథలు, వాటిని తీసే దర్శకులు ఎప్పుడూ అందుబాటులో ఉండటం కష్టం.. అందుకే కొన్ని సార్లు ఇమేజ్, మార్కెట్ పెరగటం కూడా పంటి నొప్పిలా కనిపించకుండా కంగారుపెట్టిస్తుందనుకోవాల్సి వస్తోంది.