ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగ, దీపావళికి మరో సినిమా రిలీజ్…?

కల్కీ సినిమా బంపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్ లో సైతం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉండటంతో దాదాపు అన్ని వర్గాలకు సినిమా బాగా నచ్చేసింది అనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు.

  • Written By:
  • Publish Date - September 4, 2024 / 12:07 PM IST

కల్కీ సినిమా బంపర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్ లో సైతం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు. హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉండటంతో దాదాపు అన్ని వర్గాలకు సినిమా బాగా నచ్చేసింది అనే చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. వచ్చే ఏడాది ఆ మూడు విడుదలకు సిద్దం అవుతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రభాస్ సినిమాలు చేయడంతో బాలీవుడ్ కూడా కాస్త షాక్ లోనే ఉంది. ప్రభాస్ సినిమాలకు బాలీవుడ్ సినిమాలకు వసూళ్ళలో చాలా తేడా ఉంది.

దీనితో ఇప్పుడు బాలీవుడ్ హీరోలు… చిన్న హీరోలు అయిపోయారు అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇక ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని అక్కడి హీరోలు ప్రభాస్ ను తమ సినిమాల్లోకి తీసుకునే ప్లాన్ చేస్తున్నారు. ఆ విషయంలో అజయ్ దేవగన్ ముందు అడుగు వేసినట్టు టాక్. అజయ్ దేవగన్… రోహిత్ శెట్టి కాంబినేషన్ లో వస్తున్న సింగం ఎగైన్ సినిమాలో ప్రభాస్ ను అతిధి పాత్రలో తీసుకుంటే మంచిది అనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. రోహిత్ శెట్టి మంగళవారం ఒక వీడియో విడుదల చేసారు.

కల్కీ 2898 ఏడీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఉన్న వీడియోలో… గాల్లో ఎగురుతూ కిందకు వచ్చే వాహనం ఈ వీడియోలో ఉంది. ఈ హీరో లేకుండా సింగం అసంపూర్ణంగా ఉంటుందని రోహిత్ శెట్టి కామెంట్ చేసాడు. ఈ వాహనంలో హీరో ఉన్నాడు, దీపావళికి అందులో నుంచి దిగుతాడు అని రోహిత్ కామెంట్ చేసాడు. దీనితో దీపావళికి వచ్చే సింగం అగైన్ సినిమాలో ప్రభాస్ కచ్చితంగా నటిస్తాడు అన్ని అతిధి పాత్రలో ఆయన్ను మంచి యాక్షన్ సీన్స్ లో చూపిస్తారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సింగం సీరీస్ లో వచ్చే సినిమాలో తర్వాత ప్రభాస్ నే హీరోగా చూపిస్తారని టాక్.