తగ్గేదే లే.. నీతో రాజీ లేదు: రేవంత్ కు పుష్ప కౌంటర్

సంధ్య థియేటర్‌ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అల్లు అర్జున్ స్పందించారు. శనివారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చిన అల్లు అర్జున్... ఎవరి తప్పూలేదని అనుకోకుండా జరిగిన సంఘటన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు.

  • Written By:
  • Publish Date - December 21, 2024 / 09:01 PM IST

సంధ్య థియేటర్‌ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు అల్లు అర్జున్ స్పందించారు. శనివారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చిన అల్లు అర్జున్… ఎవరి తప్పూలేదని అనుకోకుండా జరిగిన సంఘటన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. ఈ ఘటనలో గాయపడిన చిన్నారి శ్రీతేజ్‌ కోలుకోవాలని కోరుకుంటున్నా అని ఆకాంక్షించాడు. నేను ఎవరినీ తప్పుపట్టడం లేదని చెప్పుకొచ్చాడు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అది భరించలేకపోతున్నా అన్నాడు అల్లు అర్జున్.

15 రోజులుగా ఇంట్లోనే కూర్చొని బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసాడు. ప్రభుత్వంతో నేను ఎలాంటి వివాదం కోరుకోవడం లేదన్న అల్లు అర్జున్… తన వ్యక్తిత్వాన్ని హననం చేయాలని చూస్తున్నారని, సీఎం రేవంత్ వ్యాఖ్యలు బాధ కలిగించాయని చెప్పుకొచ్చాడు. అనుమతి లేకుండా వెళ్లామనేది తప్పుడు ఆరోపణ, రోడ్‌ షో చేశామని చెప్పడం సరికాదని కొట్టిపారేశాడు. అనుమతి లేకుంటే నేను అక్కడికి వెళ్లేవాడిని కాదన్నాడు. వేల మంది నన్ను చూడటానికి వచ్చారని… రికి ధన్యవాదాలు చెప్పడానికి బయటికి వచ్చానని రాకపోతే పొగరు అనుకుంటారని వచ్చినట్టు చెప్పుకొచ్చాడు.

తొక్కిసలాట గురించి మరుసటి రోజు తెలిసిందని.. తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నానని అనడం సరికాదని సీఎం వ్యాఖ్యలను ఖండించాడు. క్రౌడ్‌ ఎక్కువగా ఉందని చెప్పగానే వెళ్లిపోయానని… అసలు తన వద్దకు ఏ పోలీస్ రాలేదని స్పష్టత ఇచ్చాడు. ఘటన జరిగిన వెంటనే ఆస్పత్రికి వెళ్దామనుకున్నాని… పోలీసులు నన్ను వెళ్లొద్దని చెప్పారని.. చిరంజీవి, పవన్‌ అభిమానులను పరామర్శించడానికి.. నేను ఎంతో దూరం వెళ్లానని నా అభిమానులకు ఇబ్బంది కలిగితే వెళ్లనా అని నిలదీశాడు. సినిమా హిట్‌ అయ్యాక విజయోత్సవం జరుపుదామనుకున్నామని ఈ ఘటన తర్వాత రద్దు చేసుకున్నామని వివరించాడు.