Puri Jagannath: పూరీని వెంటాడుతున్న లైగర్..

భారీ అంచనాలతో వచ్చిన లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా నిలిచింది. గత ఏడాది ఆగష్టు 25న రిలీజైన ఈ సినిమా దెబ్బకు పూరితో పాటు ప్రొడ్యూసర్స్‌, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఊహించని రీతిలో లైగర్ భారీ నష్టాలు మిగిల్చింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు అంత పూరి వెంట పడ్డారు.

  • Written By:
  • Publish Date - May 12, 2023 / 06:07 PM IST

తమ లాస్ తిరిగి ఇవ్వళన్తు డిమాండ్ చేసారు. కొన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ధర్నాకు దిగారు. తమ నష్టాలు తగ్గించుకోవడానికి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు డైరెక్టర్ పూరిపైనే ఎక్కువ ఒత్తిడి తెస్తున్నారు. దీనిపై పూరి కూడా ఓసారి స్పందించారు. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం తనకు లేకపోయినా బయ్యర్లు నష్టపోయారు కనుక ఇచ్చేందుకు ఒప్పుకుంటున్నానని పూరి అన్నారు. దీంతో కొద్ది రోజుల పాటు ఈ వ్యవహారం సైలెంట్ అయింది. కానీ తాజాగా మరోసారి వీళ్లు రోడ్డుపైకి వచ్చారు.

తాజాగా ‘లైగర్’ మూవీ నైజాం ఏరియా ఎగ్జిబిటర్లు ధర్నా చేపట్టారు. హైదరాబాద్ లోని ఫిల్మ్‌ ఛాంబర్‌ ముందు రిలే దీక్షకు దిగారు. లైగర్ సినిమాతో భారీగా నష్టాలు వచ్చాయని తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తమకు డబ్బులు ఇస్తామని పూరి జగన్నాథ్ మాట ఇచ్చారని కానీ ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ లేదని మండిపడుతున్నారు. తమకు చెప్పినట్లు డబ్బులు ఇవ్వకపోతే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే ఇదే విషయంలో లైగర్ ప్రొడ్యూసర్లలో ఒకరైన ఛార్మి కౌర్ స్పందిచింది. అందరికి న్యాయం చేస్తాం అంటూ ఓ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి..