రాజకీయాల్లోకి రమ్మని నన్ను అడుగుతున్నారు. నాకే ఇంకా స్పష్టత లేదు. వెళ్లాలా? వద్దా? అన్న ఆలోచనలో ఉన్నా. సినిమా పరిశ్రమలోనే ఎవరైనా నాపై కామెంట్స్, విమర్శలు చేస్తే తట్టుకోలేను. రాజకీయాల్లోకి వెళ్లాలంటే మానసికంగా అన్నింటికీ సిద్ధపడి వెళ్లాలి. నా వల్ల కాకపోవచ్చు. ఇందులోనే మీకు కావాల్సిన సమాధానం వెతుకోవచ్చు’’ అని దిల్‌రాజు అన్నారు. ఇక గ్రామాల్లో ‘బలగం’ చిత్ర ప్రదర్శనలను అడ్డుకుంటారన్న ప్రచారాన్ని కూడా దిల్ రాజు ఖండించారు.
ప్రేక్షకులు ఏ రకంగా సినిమా చూసినా తమకు ఆనందమేనని, గ్రామాల్లో జరిగే ప్రదర్శనలు అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. తమ చిత్రాన్ని చూసి కుటుంబాలు కలుస్తున్నాయంటే అంతకంటే అదృష్టం ఇంకేముంటుందన్నారు. డబ్బు కంటే గొప్ప సినిమా ఇచ్చామనే అనుభూతి కలుగుతోందన్నారు. ఇలా బహిరంగ ప్రదర్శనల వల్ల ఓటీటీ సంస్థతో న్యాయపరమైన ఇబ్బందులున్నాయని, వాటిని తమ సంస్థ పరిష్కరించుకుంటుందని వెల్లడించారు. ఇంకా గ్రామాల్లో ఏవరైనా ‘బలగం’ చూడాలనుకుంటే తామే ఏర్పాట్లు చేస్తామని దిల్ రాజు ప్రకటించారు.