SALAAR: సలార్ స్టోరీ లీక్.. ఇక పూనకాలు గ్యారెంటీ..!

దర్శకుడు ప్రశాంత్ నీల్ అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చి డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేశాడు. ఓ ఇంగ్లీష్‌ మీడియాతో ముచ్చటించిన ప్రశాంత్ నీల్ సలార్ స్టోరీ లీక్‌ చేశారు. సింపుల్‌గా ఒక్క లైన్‌లో ఆయన కథేంటో చెప్పారు. ఇది ఇద్దరు ఫ్రెండ్స్ కథ అన్నారు.

  • Written By:
  • Publish Date - November 29, 2023 / 06:34 PM IST

SALAAR: సలార్ టీజర్ రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ ఇండియా మొత్తం.. ఎంతో యాంగ్జైటీగా వెయిట్ చేస్తోంది. ఈ ట్రైలర్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ సందడి ఇప్పటినుంచే మొదలైపోయింది. ప్రభాస్ క్రేజ్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ కావడంతో ఈ సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో ప్రభాస్ పూర్తి మాస్‌ రోల్ చేయడంతో.. డార్లింగ్ మాస్‌ యాక్షన్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. దీంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చి డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేశాడు.

Rajinikanth: సూపర్ స్టార్ క్రేజ్.. రజినీ కోసం యంగ్ హీరో

ఓ ఇంగ్లీష్‌ మీడియాతో ముచ్చటించిన ప్రశాంత్ నీల్ సలార్ స్టోరీ లీక్‌ చేశారు. సింపుల్‌గా ఒక్క లైన్‌లో ఆయన కథేంటో చెప్పారు. ఇది ఇద్దరు ఫ్రెండ్స్ కథ అన్నారు. అయితే స్నేహితులు అతి పెద్ద శతృవులుగా ఎలా మారారు..? ఎందుకు మారారు..? ఆ తర్వాత ఇద్దరి మధ్య జరిగే ఫైటే ఈ సినిమా కథ అని చెప్పారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. సినిమాలో ఫ్రెండ్‌షిప్‌ కోర్ పాయింట్‌ అని.. ప్రశాంత్ నీల్ స్టోరీ లీక్‌ చేయడంతో ఫ్యాన్స్‌ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. సలార్‌గా ప్రభాస్‌ కనిపిస్తే, వరదరాజా మన్నార్‌గా పృథ్వీరాజ్‌ కనిపిస్తున్నారు. భావోద్వేగాలకు పెద్ద పీట వేసే ప్రశాంత్ నీల్.. ఈ యాంగిల్‌ను ఎలా ప్రెజెంట్ చేస్తారో అని ఫ్యాన్స్ అప్పుడే డిస్కషన్స్ మొదలు పెట్టేశారు. మొత్తానికి ఇప్పుడు దేశ వ్యాప్తంగా సలార్ ఫీవర్ నడుస్తోంది.

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ గూస్‌ బమ్స్ తెప్పించేలా ఉంది. ఇందులో కనీసం ప్రభాస్‌ ఫేస్‌ కూడా సరిగా కనిపించనప్పటికీ.. ఎలివేషన్లు, ప్రభాస్‌ చేసే యాక్షన్‌, రణభూమిలో ప్రత్యర్థులను ఊచకోత కోయడం వంటి సీన్లు చూస్తే ఈ సినిమాలో డార్లింగ్ ఏ రేంజ్‌లో రచ్చ చేయబోతున్నాడో అర్థమమైపోయింది. దీనికితోడు మొదట్లో ప్రభాస్‌ పాత్ర గురించి డైనోసార్‌ అంటూ ఇచ్చిన ఎలివేషన్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ను పీక్స్‌కు తీసుకుపోయింది. అందనంత హైట్స్‌లో నిలుచున్న సలార్‌ మూవీ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరి ప్రభాస్‌, ప్రశాంత్ స్కై లిమిట్‌కు తీసుకువెళ్తారని ఫ్యాన్స్ అంటున్నారు.