GAAMI VS BHIMA: విశ్వక్ సేన్ కెరీర్ మొదట్లో కమిటైన గామి, ఇప్పుడు రిలీజైంది. అయినా కథ కాని, కథనం కాని ఎక్కడా బోర్ కొట్టించలేదు. మూవీలో మ్యాటర్ ఎక్స్‌పైరీ కాలేదు. మరొకరి స్పర్శకూడా భరించలేని జబ్బుతో బాధపడే ఓ అఘోరా కథే గామి. దీనికి తోడు ఇండియా, చైనా బోర్డర్‌లో ల్యాబోరేటరి, అందులో ఓ వ్యక్తి ఇబ్బందులు, ఇవన్నీ పీడకలలా హీరోని వెంటాడటం వీటికి తోడు తన సమస్యకి పరిష్కారం వెతుక్కుంటూ ఓ పుష్పం కోసం హీరో సాహసాలు చేయటం.. ఇది సింపుల్‌గా కథ.. ఈ కథ, కథనం కదిలించింది.
Bhimaa Review: మాస్ జాతర.. భీమా ఫ్యాన్స్కు ఫుల్ మిల్స్
ఆ విజువల్స్, గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమా తరహాలో ఉన్నాయి. మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేసింది. కొన్ని లాజిక్స్, స్లో నెరేషన్ పక్కన పెడితే, మిగతా అన్ని కోణాల్లో గామిని మెచ్చుకోక తప్పదు. అలాగని అందరికి నచ్చేస్తుందనేంతగా కమర్శియల్ ఎలిమెంట్స్ కూడా లేవు. ఇక ఇవాళే.. వచ్చిన భీమా మూవీ విషయానికొస్తే, ఒక వైపు శివుడు, మరో వైపు పోలీస్ అన్నీంటికి మించి పరశురాముడి క్షేత్రంలో జరిగే సంఘటనలు వాటిని ఛేదించేందుకు రంగంలోకి దిగినపోలీస్ ఆఫీసర్ భీమాగా హీరో.. అచ్చంగా హీరో రాజశేఖర్ చేసిన కల్కి కాన్సెప్ట్‌తో కాస్త పోలికలున్నట్టు కథ కనిపిస్తుంది. కాని ఓవరాల్‌గా సాలిడ్ కంటెంట్‌తోనే ఫిల్మ్ టీం దండెత్తింది.
భీమాగా యాక్షన్ సీక్వెన్స్‌లో గోపీచంద్ పాతుకుపోతే, మిగతా టీం పర్లేదనిపించింది. మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫి అన్నీ కలిసొచ్చాయి. కేవలం డిఫరెంట్ కాన్సెప్ట్‌కి రొటీన్ ట్రిట్మెంటే కాస్త నిరుత్సాహపరిచింది. కాని డివోషనల్ యాంగిల్ మాత్రం రొటీన్ సినిమాను స్పెషల్‌గా మార్చింది. ఓవరాల్‌గా మిక్స్‌డ్ టాక్ కంటే పాజిటివ్ టాకే పెరుగుతోంది.