GAAMI: త్రిబుల్ ఆర్ మూవీ ఒక తెలుగు సినిమా. పాన్ ఇండియా లెవల్లో వచ్చినా పాన్ వరల్డ్ మార్కెట్ అటెన్షన్ ఎలా లాక్కోవాలో చూపించిన మూవీ. ఆ సినిమా బాటలోనే నడిచింది కార్తికేయ 2 మూవీ. కార్తికేయ 2 లానే హనుమాన్ కూడా త్రిబుల్ ఆర్ బాటలో వెళ్లడంవల్లే అంత పెద్ద హిట్టైంది. ఇక కన్నడ కాంతారాకి కూడా దారి చూపించింది తెలుగు హిట్ మూవీ త్రిబుల్ ఆరే. ఈ సినిమానే ఇప్పుడు విశ్వక్ సేన్ మూవీ గామీకి పాన్ ఇండియా లెవల్లో దారి చూపిస్తోంది.
Pushpa-2: పుష్పరాజ్ వేట.. జపాన్‌లో పుష్ప 2 రిలీజ్
కార్తికేయ 2, కాంతారా, హనుమాన్, గామి సినిమాలకు త్రిబుల్ ఆర్‌తో లింకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ పడ్డ కష్టం రాజమౌళి విజన్ చాలా వరకు లోబడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకు దిక్సూచిగా పనిచేసింది. త్రిబుల్ ఆర్ రిలీజైనప్పుడు అందులో రామ్, భీమ్ పాత్రల్లానే చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఆడియన్స్‌కి నచ్చేలా గుడులూ, గోపురాల్లో పూజలు చేసిన నార్త్ ఇండియన్స్‌కి దగ్గరయ్యారు. దీక్షలో ఉన్నారు కాబట్టి కాళ్లకు చెప్పుల్లేకుండా నడిచి అలా కూడా నార్త్ బెల్డ్‌కి నచ్చేలా చేశారు. ఆతర్వాత ఇదే పద్దతిని కాంతారా హీరో రిషబ్ శెట్టి ఫాలో అయ్యాడు. కార్తికేయ 2 టీం ద్వారకలో ఇలానే గుళ్లూ గోపురాలు పూజలంటూ జనాల్లోకెళ్లింది. హనుమాన్ టీం అయితే అయోధ్యకే పయనమైంది. ఇవన్నీ డివోషనల్‌గా ప్రమోషన్‌లో ఎమోషన్ క్యారీ చేశాయి.
గామీ అయితే అఘోరా కాన్సెప్ట్‌తో వస్తోంది కాబట్టి, హిమాలాయాలు, సాధువుల మధ్య ప్రమోషన్‌తో విశ్వక్ సేన్ అండ్ టీం ట్రెండ్ సెట్ చేస్తోంది. ఇది కూడా వర్కవుట్ అయితే త్రిబుల్ఆర్ రూట్లో వెళ్లి హిట్ మెట్టెక్కిన నాలుగో సౌత్ సినిమాగా సీన్ మారిపోయే ఛాన్స్ ఉంది.