GAME CHANGER: ఈపాటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకోవాల్సిన ‘గేమ్ ఛేంజర్’ నత్త నడకన సాగుతోంది. అందుకు ప్రధాన కారణం డైరెక్టర్ శంకర్ ‘ఇండియన్ 2’తో బిజీ అవ్వడమే. ఒకవైపు ‘గేమ్ ఛేంజర్‘.. మరోవైపు ‘ఇండియన్ 2’ చిత్రాలను ప్యారలల్‌గా పూర్తిచేస్తున్నాడు గ్రేట్ డైరెక్టర్ శంకర్. ఇప్పటికే ‘ఇండియన్ 2’ రెండు పాటలు మినహా మొత్తం షూటింగ్ పూర్తిచేసుకుందట. దాంతో.. ఇకపై ‘గేమ్ ఛేంజర్’పైనే శంకర్ ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
Kalki 2898 AD: వచ్చేది ఆ రోజునే.. కల్కి ట్రైలర్ కు డేట్ ఫిక్స్..!
తాజాగా ‘గేమ్ ఛేంజర్’ కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలైంది. ఈ షెడ్యూల్‌లో సినిమాలోని కీలక పాత్రధారులైన శ్రీకాంత్, సముద్రఖని, ఎస్.జె. సూర్యలపై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. రెండు, మూడు రోజుల్లో చరణ్ కూడా సెట్స్‌లో జాయిన్ కాబోతున్నట్టు తెలుస్తోంది. రామ్ చరణ్‌కి జోడీగా కియరా అద్వానీ నటిస్తున్న ఈ మూవీలో అంజలి మరో ఫీమేల్ లీడ్‌లో మురిపించబోతుంది. దీపావళి కానుకగా ఈ చిత్రం నుంచి ‘జరగండి..‘ అంటూ సాగే పాట రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాలతో ఆ పాట విడుదల వాయిదా పడింది.
దీంతో న్యూఇయర్ కానుకగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతొంది. సంక్రాంతికి పక్కాగా ట్రీట్ ఉంటుందట. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈమూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈమూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.