Ramcharan : మే 1 నుంచి ‘గేమ్ ఛేంజర్’ కొత్త షెడ్యూల్

గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ (Star Director) శంకర్ (Shankar) కాంబినేషన్ లో వస్తన్న మోస్ట్ అవైటింగ్ మూవీ గేమ్ ఛేంజర్.. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. అయితే.. ఈ మూవీ మొదలై సంవత్సరాలు గడుస్తున్నా.. సరైన అప్డేట్ ఒకటంటూ లేదు. దీంతో ఫ్యాన్స్ కూడా శివాలెత్తుతున్నారు.

గ్లోబల్ స్టార్ (Global Star) రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ (Star Director) శంకర్ (Shankar) కాంబినేషన్ లో వస్తన్న మోస్ట్ అవైటింగ్ మూవీ గేమ్ ఛేంజర్.. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. అయితే.. ఈ మూవీ మొదలై సంవత్సరాలు గడుస్తున్నా.. సరైన అప్డేట్ ఒకటంటూ లేదు. దీంతో ఫ్యాన్స్ కూడా శివాలెత్తుతున్నారు. నిజానికి ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అయిపోవాల్సింది. పలు అనివార్య కారణాలతో వాయిదా పడుతుండటం,మధ్యలో కమలహాసన్ ఇండియాన్ 2 (Indian 2) తో డైరెక్టర్ శంకర్ బిజీగా ఉండటం జరుగుతూ వచ్చింది. దీంతో.. ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్‌కు ఎదురు చూపులు తప్పడం లేదు.. ఇలాంటి టైమ్‌కు ఈ మూవీకి సంబంధించిన ఓ లేటెస్ట్ అప్‌డేట్ ఫ్యాన్స్‌కు కాస్త ఊరట కలిగిస్తోంది.

మండే ఎండల్లో కాస్త హాయినిచ్చే చిరుగాలిలా.. ఈ మూవీ అప్‌డేట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కు కాస్త ఊరటనిచ్చే లేటెస్ట్‌ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ పై కొత్త అప్ డేట్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్ మే 1 నుంచి చెన్నైలో జరగనుందట. హైదరాబాద్ షెడ్యూల్ నిన్న పూర్తయిందని టాక్ వినిపిస్తోంది. దీనికి సంంబంధించి శంషాబాద్‌లో రామ్ చరణ్, సునీల్, నవీన్ చంద్ర కాంబోలో పలు సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వచ్చే షెడ్యూల్ కూడా ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. కథ ప్రకారం ఈ షెడ్యూల్ చాలా కీలకం అని, ఈ షెడ్యూల్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే చరణ్ సీనియర్ పాత్ర పై ఉంటుందని ఫిలింవర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.. ఈ న్యూస్ విని మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

కాగా ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మూవీ లేట్ అవుతున్నప్పటికీ ఈ సినిమాలో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ను పెడుతున్నాడు శంకర్. ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇక ఇటీవల చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ‘జరగండి’ సాంగ్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అ మొత్తానికి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో బరువైన ఎమోషన్స్ తో పాటు గ్రాండ్ విజువల్స్ కూడా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.