GAME CHANGER: శంకర్ నిర్ణయంతో టాలీవుడ్‌లో మారనున్న లెక్కలు..

12న గేమ్ ఛేంజర్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్న టీం.. ఆ పాటతోనే విడుదల తేదీ ప్రకటించబోతోంది. ఐతే ఆ డేట్‌తో మరో హీరోతో వార్‌కి డోర్ తీసేలా ఉన్నాడు శంకర్. అయితే అది ముందుగా దేవర అన్నారు. కాని దేవర మూవీ విడుదల టైంలో శంకర్ తన భారతీయుడు 2ని రిలీజ్ చేయబోతున్నాడట.

  • Written By:
  • Publish Date - November 10, 2023 / 07:46 PM IST

GAME CHANGER: గేమ్ ఛేంజర్ సాంగ్‌తోపాటు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో తేలింది. శంకర్ (SHANKAR) పక్కా ప్లానింగ్‌తోనే ఉన్నాడు. 12న గేమ్ ఛేంజర్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయబోతున్న టీం.. ఆ పాటతోనే విడుదల తేదీ ప్రకటించబోతోంది. ఐతే ఆ డేట్‌తో మరో హీరోతో వార్‌కి డోర్ తీసేలా ఉన్నాడు శంకర్. అయితే అది ముందుగా దేవర అన్నారు. కాని దేవర మూవీ విడుదల టైంలో శంకర్ తన భారతీయుడు 2ని రిలీజ్ చేయబోతున్నాడట. ఏప్రిల్ 4కి భారతీయుడు 2 విడుదల అంటున్నారు.

ALLU ARJUN Vs YASH: అల్లు అర్జున్ మీద ఫైర్ అవుతున్న కన్నడ స్టార్ ఫ్యాన్స్..

అప్పుడే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసిన దేవర రాబోతోంది. ఆ రోజే భారతీయుడు 2 వస్తే ఎన్టీఆర్ మరుసటి రోజే కమల్ హాసన్ మూవీతో పోటీ పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మూవీ సంగతి అటుంచితే గేమ్ ఛేంజర్ విడుదల తేదీ కూడా భారతీయుడు 2 లానే మరో హీరో మూవీ విడుదల తేదీకి అడ్డయ్యేలా ఉంది. ఆగస్ట్ 15కి గేమ్ ఛేంజర్ రిలీజ్ అంటూ ఒక వార్త హాట్ టాపిక్ అయ్యింది. దిల్ రాజు ఏకంగా పుష్ప 2 విడుదలయ్యే రోజే గేమ్ ఛేంజర్‌ని రిలీజ్ చేయబోతున్నారంటున్నారు. అయితే బ్యాకప్ ప్లాన్ దసరా అనే టాక్ కూడా పెరిగింది.

ఆగస్ట్ 15న గేమ్ ఛేంజర్‌కి ఛాన్స్ లేదంటే అప్పుడు దసరా రిలీజ్‌కి కూడా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట. పుష్ప ఆగష్టుకే వచ్చే మూవీ అయినా.. అది వాయిదా పడితే గేమ్ ఛేంజర్‌కి కలిసొస్తుందని, ఆగస్ట్ 15 రిలీజ్ డేట్‌కి ఫస్ట్ ప్రాయారిటీ ఇస్తున్నాడు దిల్ రాజు. ఇలా అటు తారక్, ఇటు బన్నీ సినిమాలకు శంకర్ మూవీలు పోటీగా మారేలా ఉన్నాయి.