Game Changer: గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ వాయిదా.. అసలు కారణం చెప్పిన మేకర్స్..!

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్‌తో భారతీయుడు-2 చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో శంకర్.. 'గేమ్ ఛేంజర్' మొదలుపెట్టాడు. అయితే, అనూహ్యంగా భారతీయుడు-2 మళ్లీ మొదలైంది. అంతే.. అప్పటినుంచి 'గేమ్ ఛేంజర్' షూటింగ్ పడుతూ.. లేస్తూ.. అన్నట్లు సాగుతోంది.

  • Written By:
  • Publish Date - September 24, 2023 / 08:28 PM IST

Game Changer: మెగా ఫ్యాన్స్‌కు షాకిచ్చింది ‘గేమ్ ఛేంజర్’ మూవీ టీమ్. ఈ వారమే ప్రారంభం కావాల్సిన మూవీ షూటింగ్ వాయిదా పడినట్లు తెలిపింది. శంకర్ దర్శకత్వంలో ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్నమూవీ ‘గేమ్ ఛేంజర్’. మూడేళ్లక్రితం ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ నత్తనడకన సాగుతోంది. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్‌తో భారతీయుడు-2 చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో శంకర్.. ‘గేమ్ ఛేంజర్’ మొదలుపెట్టాడు. అయితే, అనూహ్యంగా భారతీయుడు-2 మళ్లీ మొదలైంది.

అంతే.. అప్పటినుంచి ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ పడుతూ.. లేస్తూ.. అన్నట్లు సాగుతోంది. ఇంతకాలం షూటింగ్ జరగడంతో ఫ్యాన్స్ కూడా నిరాశలో ఉన్నారు. సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. సినిమా షూటింగ్ ఎంతవరకు పూర్తైందో కూడా తెలీదు. శంకర్ అటు భారతీయుడు-2, ఇటు ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్స్ వరుసగా చేస్తుండటంతో గందరగోళం నెలకొంది. రెండింట్లో ఏ సినిమా షూటింగ్ పూర్తవుతుందో.. ఏది ముందువస్తుందో తెలీదు. ఇలాంటి సమయంలో సెప్టెంబర్ చివరి వారంలో ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ ప్రారంభమవుతోందన్న వార్త ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. సినిమా యూనిట్ కూడా దీనికి తగ్గ ఏర్పాట్లు చేసింది. అయితే, అనూహ్యంగా సినిమా వాయిదా పడినట్లు నిర్మాణం సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయం తెలిపింది. కొందరు ముఖ్యమైన నటుల డేట్స్ అందుబాటులో లేకపోవడం వల్లే షూటింగ్ వాయిదా పడినట్లు వెల్లడించింది.

అక్టోబర్ రెండో వారం నుంచి షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని తెలిపింది. దీంతో ఫ్యాన్స్ అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ముగుస్తుందా.. రామ్ చరణ్ మూవీ థియేటర్లలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్థంలోనే ప్రేక్షకుల ముందుకు రావొచ్చు.