పాన్ ఇండియా పక్కన పెడితే… తెలుగులో మాత్రం దేవర చేసిన విధ్వంశం అంతా ఇంతా కాదు. ఇండియా వైడ్ గా దేవర సాధించిన సక్సెస్… అమెరికాలో అందుకున్న కొన్ని ఫీట్స్… ఎన్టీఆర్ ను ఎవరెస్ట్ పై నిలబెట్టాయి. ట్రోలింగ్ తో సంబంధం లేకుండా ఎన్టీఆర్… దేవరతో మంచి హిట్ కొట్టాడు. ఒంటరి పోరాటంతో కనీసం ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేకుండా ఎన్టీఆర్ హిట్ కొట్టి చూపించాడు. అమెరికాలో అయితే గతంలో ఏ తెలుగు సినిమాకు లేని బజ్ క్రియేట్ అయింది. ప్రీ రిలీజ్ మార్కెట్ ఓ రేంజ్ లో జరిగింది.
ప్రభాస్ సినిమాలను కూడా దేకని చోట దేవర సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. నార్త్ ఇండియాలో కూడా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా దేవర సినిమా ఆకట్టుకున్న మాట వాస్తవం. పెయిడ్ బుకింగ్స్ అని కొందరు కామెంట్స్ చేసినా తాను ఏం ప్రూవ్ చేసుకోవాలో అది ప్రూవ్ చేసుకున్నాడు ఎన్టీఆర్. ఇండియా సంగతి పక్క్కన పెడితే ఓవర్సీస్ లో ఎన్టీఆర్ ఫిక్స్ చేసిన టార్గెట్ చిన్నది కాదు. ఊహకు కూడా అందని ప్రీ బుకింగ్ మార్కెట్ యూఎస్ లో జరిగింది. అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయిన దగ్గరి నుంచి సత్తా చాటాడు దేవర.
ఇప్పుడు… ఆ టార్గెట్ ను రీచ్ అయి కొత్త టార్గెట్ ఫిక్స్ చేయడానికి మెగా హీరోలు, అల్లు అర్జున్, రామ్ చరణ్ తీవ్రంగా కష్టపడుతున్నారు. పుష్ప 2 సంగతి పక్క్కన పెడితే గేమ్ చేంజర్ కు మాత్రం ఇప్పుడు దేవర రికార్డ్ బీట్ చేయడం తప్పని పరిస్థితి. దేవరను ఎక్కువ టార్గెట్ చేసింది మెగా ఫ్యాన్స్ మాత్రమే. అందుకే ఇప్పుడు అమెరికాలో ఈవెంట్ ప్లాన్ చేసి రికార్డ్స్ బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చేస్తున్నామని డిసెంబర్ 21 కే ముహూర్తం కూడా ఫిక్స్ చేసామని మేకర్స్ అధికారికంగా ప్రకటన చేసారు. కర్టిస్ కల్‌వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, గార్‌లాండ్ టి.ఎక్స్ 75040 లో ఈ ఈవెంట్ ను చేయనున్నారు. దీని ఉద్దేశం కచ్చితంగా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడమే అనేది క్లియర్ గా అర్ధమవుతోంది. దేవరను తక్కువ అంచనా వేసిన మెగా ఫ్యాన్స్ ఇప్పుడు కాలర్ ఎగరేయాలి అంటే రామ్ చరణ్ కష్టపడక తప్పని పరిస్థితి.