Charan NTR : గేమ్‌ ఛేంజర్‌ VS దేవర

ట్రిపుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా (Pan India) హిట్‌ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) , జూనియర్ ఎన్టీఆర్ (NTR) నుంచి వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలు గేమ్ చేంజర్, దేవర్.. ఎంతో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలపై ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. రియల్ లైఫ్‌లో చెర్రీ, జూనియర్ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే.. ఇక ఈ ఇద్దరి స్నేహానికి తగ్గట్లుగానే ట్రిపుల్ ఆర్‌ (RRR) సిని్మాలో వారి పాత్రలను తీర్చి దిద్దాడు జక్కన్న..

ట్రిపుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా (Pan India) హిట్‌ తర్వాత రామ్ చరణ్ (Ram Charan) , జూనియర్ ఎన్టీఆర్ (NTR) నుంచి వస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలు గేమ్ చేంజర్, దేవర్.. ఎంతో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలపై ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. రియల్ లైఫ్‌లో చెర్రీ, జూనియర్ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే.. ఇక ఈ ఇద్దరి స్నేహానికి తగ్గట్లుగానే ట్రిపుల్ ఆర్‌ (RRR) సిని్మాలో వారి పాత్రలను తీర్చి దిద్దాడు జక్కన్న.. అయితే.. ట్రిపుల్ ఆర్ సినిమాలో మధ్యలో ఎన్టీఆర్‌ (NTR), రామ్‌ చరణ్‌ భీకరంగా కొట్టుకుంటారు. స్నేహం కాస్త శతృత్వంగా మారుతుంది. కానీ ఇప్పుడు ఇది మళ్లీ రియల్‌గా జరగబోతోందా అన్న డౌట్‌ ఏర్పడుతోంది. ఎందుకంటే.. ఈ ఇద్దరు నటిస్తోన్న దేవర, గేమ్‌ చేంజర్ (Game Changer) సినిమాలు బాక్సాఫీస్ మధ్య తలబడబోతున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అతిపెద్ద బాక్సాఫీస్ యుద్ధం తప్పదంటున్నాయి ఫిలింవర్గాలు..

ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల నుంచి వస్తున్న సినిమాలు ఇవే కావడంతో.. ఈ రెండు సినిమాలు ఇద్దరు హీరోలకు చాలా ప్రెస్టీజియస్‌గా మారాయి. చరణ్ ‘ఆచార్య’లో నటించినప్పటికీ ఆ సినిమాలో ఆయన హీరో కాదు.. కేవలం కీలక పాత్ర పోషించాడు. దీంతో.. ఈ సినిమాలపై పాన్ ఇండియా లెవెల్‌లో అంచనాలు స్కైహైగా మారాయి. దీనికి తగ్గట్లుగానే దేవర సినిమాను కొరటాల శివ, గేమ్‌ ఛేంజర్‌ను శంకర్ భారీ లెవెల్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ కారణంగానే ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.. గేమ్‌ ఛేంజర్‌ను కూడా అక్టోబర్‌లో రిలీజ్ చేయడానికి శంకర్‌ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. అదే జరిగితే మాత్రం బాక్సాఫీస్ వద్ద దేవర్, గేమ్‌ ఛేంజర్ తలపడడం ఖాయం. అదే జరిగితే ఈ మధ్య కాలంలో ఇదే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ క్లాష్ తప్పదంటున్నారు.

చెర్రీ, జూనియర్ ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ.. ట్రిపుల్ ఆర్ కారణంగా ఆ ఇద్దరి ఫ్యాన్స్ మాత్రం బద్ధ బద్ద శత్రువులుగా మారిపోయారు. సోషల్ మీడియాలో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఇప్పటికీ విమర్శించుకుంటున్నారు. ఇప్పుడు దేవర, గేమ్‌చేంజర్ గనక బాక్సాఫీస్ దగ్గర ఎదురు పడితే ఇక వీళ్ల రచ్చ మధ్య గొడవ మరో స్థాయికి చేరేలా ఉందంటున్నారు.
మరోవైపు రెండు సినిమాలు భారీ లెవెల్లో భారీ కాస్టింగ్‌తో తెరకెక్కడంతో రెండు సినిమాల మధ్య అన్ని విషయాల్లోనూ కంపేరిజ‌న్ వ‌స్తోంది.. ఎవ‌రిది పైచేయి అవుతుంది. ఏ సినిమా బిజినెస్ టాప్‌లో ఉంటుందన్నది హాట్‌టాపిక్‌గా మారింది.. మరి.. బాక్సాఫీస్ దగ్గర పోటీకి చెర్రీ, జూనియర్ ఒప్పుకుంటారా..? తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతారో.. ఒక వేళ అదే జరిగితే.. బాక్సాఫీస్ దగ్గర పైచేయి ఎవరిది..? ఈ విషయాలకు సమాధానం దొరకాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే..