గేమ్ చేంజర్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్, అమెరికా ఒత్తిడిలో రామ్ చరణ్…?

దేవర సినిమా దెబ్బకు ఇప్పుడు హీరోలు కూడా ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నారు అనే మాట అక్షరాలా నిజం. ఇప్పుడు హీరోలకు రికార్డులు చాలా ముఖ్యం అయ్యాయి. గతంలో వంద రోజులు ఆడటం గొప్ప ఇప్పుడు వెయ్యి కోట్లు సాధించడం గొప్ప.

  • Written By:
  • Publish Date - October 8, 2024 / 05:39 PM IST

దేవర సినిమా దెబ్బకు ఇప్పుడు హీరోలు కూడా ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నారు అనే మాట అక్షరాలా నిజం. ఇప్పుడు హీరోలకు రికార్డులు చాలా ముఖ్యం అయ్యాయి. గతంలో వంద రోజులు ఆడటం గొప్ప ఇప్పుడు వెయ్యి కోట్లు సాధించడం గొప్ప. వంద కోట్ల వసూళ్ళ లెక్కలు అయిపోయి ఇప్పుడు విదేశాల్లో ప్రీ బుకింగ్ మార్కెట్ మీద పడ్డారు జనాలు. ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడంలో ఏ మాత్రం ఫెయిల్ అయినా సరే వేరే హీరోల ఫ్యాన్స్ మాటలతో రక్తం తాగడానికి రెడీగా ఉంటారు. అందుకే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు.

కొందరు అగ్ర హీరోల విషయంలో ఇప్పుడు ఫ్యాన్స్ అత్యుత్సాహం కూడా ఒత్తిడి పెంచుతోంది. దేవర సినిమా విషయమే చూస్తే… అమెరికాలో దేవర చాలా దూకుడుగా ప్రీ బుకింగ్ మార్కెట్ చేసింది. విడుదలకు ముందే రెండు మిలియన్లకు పైగా వసూలు చేసిన తొలి ఇండియన్ సినిమాగా నిలిచింది. దీనితో వేరే హీరోల ఫ్యాన్స్ కూడా ఆ టార్గెట్ ను తమ హీరోలు అందుకోవాలని భావిస్తున్నారు. ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ ముందు వరుసలో ఉన్నారు. దేవర సినిమా రికార్డులను రామ్ చరణ్… గేమ్ చేంజర్ సినిమా బద్దలు కొట్టాలని టార్గెట్ పెట్టుకున్నారు.

నార్త్ అమెరికాలో రామ్ చరణ్… ప్రీ బుకింగ్ మార్కెట్ టార్గెట్ 2 మిలియన్లుగా ఉంది. ఇక ఓవరాల్ గా 5 మిలియన్లు ఈ సినిమా నార్త్ అమెరికాలో తగ్గవద్దు అని రామ్ చరణ్ ప్లానింగ్ లో ఉన్నాడు. అయితే అల్లు అర్జున్ హీరోగా వచ్చే పుష్ప 2 సినిమా దెబ్బ కొట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. రామ్ చరణ్ కు గత సినిమాల మాదిరిగా ఈ సినిమా ఉండకపోవచ్చు. దేవర సినిమాను కొరటాల మీద ఉన్న కోపంతో మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేసారు. కచ్చితంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు కసితో రగిలిపోతున్న మాట వాస్తవం.

అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా టార్గెట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అన్ని వైపుల నుంచి రామ్ చరణ్ సినిమాకు గురిపెట్టే అవకాశం ఉంది. ఈ ఒత్తిడిలో కూడా రామ్ చరణ్ ఉన్నాడు. ఏ మాత్రం ఫ్యాన్స్ అంచనాలకు తగ్గినా తన మార్కెట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆచార్య ఫ్లాప్ తో మెగా ఫ్యామిలీ ఇబ్బంది పడుతోంది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రమోషన్ మొదలుపెట్టారు గట్టిగా. కొన్ని మీమ్ పేజెస్ తో టార్గెట్ ఇది అంటూ వైరల్ చేయిస్తున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటికే సినిమా విడుదల క్రిస్మస్ కు ఉంటుందని నిర్మాత దిల్ రాజు కూడా ప్రకటించారు. దీనితో మెగా ఫ్యాన్స్ గట్టిగానే రంగంలోకి దిగుతున్నారు. మరి ఏం జరగబోతుందో చూడాలి. కచ్చితంగా బాక్సాఫీస్ అయితే ప్రశాంతంగా ఉండదు.