యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) మరో సెన్సేషన్‌తో వచ్చేశాడు.. సక్సెస్, ఫెయిల్యూర్ అనే తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ హీరో… మాస్ ప్రేక్షకుల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈసారి గామి అంటూ సరికొత్త జోనర్ మూవీతో వస్తున్నాడు.
చాందినీ చౌదరి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్నారు.
అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్ గా తెరకెక్కిన ‘గామి’ (Gami) ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విజువల్ వండర్‌గా అద్భుతంగా కట్ చేసిన ఈ అడ్వెంచర్ డ్రామా ట్రైలర్ నెటిజన్లను ఓ ఊపు ఊపేస్తుంది. హైదరాబాద్ పీసీఎక్స్ స్క్రీన్ మీద ప్రత్యేకంగా లాంచ్ చేసిన ట్రైలర్ లాంచ్ కి సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరవ్వగా.. వీడియో రూపంలో ప్రభాస్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పడం స్పెషల్ కిక్ ను ఇచ్చింది.
ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరగా కనిపించనున్నట్టు ఇప్పటికే చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. కొద్ది రోజుల క్రితమే రిలీజైన విశ్వక్ ఫస్ట్ లుక్ ఈ మూవీపై ఓ రేంజిలో క్యూరియాసిటీ పెంచింది.. సినిమా కథ రివీల్ కాకుండా చాలా జాగ్రత్తగా టీజర్ కట్ చేశారు మేకర్స్. విశ్వక్ సేన్కో అరుదైన వ్యాధి ఉంటుంది. దీని పరిష్కారం మూడు దశాబ్దాలకోసారి హిమాలయాల్లో దొరికే అరుదైన మూలికలో ఉందని తెలుసుకుని అక్కడికి బయలుదేరతాడు. ఇక.. టీజర్ ప్రారంభంలో ఓ మ్యాప్ కనిపిస్తుంది. తర్వాత ‘‘ఇదే నీ సమస్యకు పరిష్కారం’’ అనే వాయిస్ వినిపిస్తుంది. అనంతరం మంచు ప్రదేశంలో ఒంటి మీద చిన్న దుస్తులతో చలికి వణుకుతున్న యువకులు కనిపిస్తారు. ఆ తర్వాత మహిళపై నీళ్లు పోయడం కనిపిస్తుంది. హీరోయిన్ చాందిని కాశీలో ఫోటోలు తీస్తూ కనిపిస్తుంది. కొంత మంది విలన్ల అరాచకాన్ని టీజర్ లో చూపించారు. శంకర్ అనే అఘోరా పాత్రలో విశ్వక్ కనిపించాడు. ఇవన్ని దాటుకుని నా వల్ల అవుతుందంటారా? అనే విశ్వక్ వాయిస్ వినిపిస్తుంది. ఆ తర్వాత విశ్వక్ మంచుకొండల్లో నడిచే విజువల్ తో టీజర్ ఎండ్ అవుతుంది.
మూడున్నర నిమిషాలకు దగ్గరగా కట్ చేసిన ట్రైలర్ ని ఆద్యంతం టెర్రిఫిక్ విజువల్స్ తో వాట్ ఎ వండర్ అన్న రేంజ్‌లో నింపేశారు. వాటికి తగిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తో ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పించింది. విశ్వక్ మేకోవర్ బాగా ఆకట్టుకుంది. ఇన్నాళ్లూ అతడు తీసిన సినిమాలకు ఈ గామికి అసలు సంబంధమే లేనట్లుగా విశ్వక్ కనిపించాడు. ఎన్నో అంశాలను మేళవించి డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే దిశగా విద్యాధర్ చూపించిన పనితనం అబ్బురపరిచేలా ఉంది. విశ్వనాథ్ ఛాయాగ్రహణం, నరేష్ కుమరన్ నేపధ్య సంగీతం రెండూ పోటీ పడ్డాయి. మహా శివరాత్రి సందర్భంగా ‘గామి’ని థియేటర్లోకి తీసుకువస్తున్నారు. మార్చి 8న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా మూవీ యూనిట్ ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ గామి మూవీ ప్రేక్షకులకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనుందో చూడాల్సిందే..