మాస్ కా దాస్ (Gangs of Godavari) విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా కృష్ణ చైతన్య (Krishna Chaitanya) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari). మే 31న విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. త్వరలోనే బ్రేక్ ఈవెన్ సాధించేలా ఉంది.
తెలుగునాట మొదటి రోజు రూ.3.51 కోట్ల షేర్ రాబట్టిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. రెండో రోజు రూ.1.55 కోట్ల షేర్ తో సత్తా చాటింది. ఏరియాల వారీగా చూస్తే.. ఇప్పటిదాకా నైజాంలో రూ.1.82 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.1 కోటి షేర్, ఆంధ్రాలో రూ.2.24 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం.. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులకు గాను రూ.5.06 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా రూ.35 లక్షల షేర్, ఓవర్సీస్ రూ.85 లక్షల షేర్ కలిపి.. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.6.26 కోట్ల షేర్ సాధించింది.
వరల్డ్ వైడ్ గా రూ.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. మొదటి రోజు రూ.4.46 కోట్ల షేర్, రెండో రోజు రూ.1.80 కోట్ల షేర్ తో రెండు రోజుల్లో 60 శాతానికి పైగా రికవర్ చేసింది. మూడు రోజు ఆదివారం కావడంతో మరో రెండు కోట్ల దాకా షేర్ రాబట్టే అవకాశముంది. ఇదే జోరు కొనసాగితే.. త్వరలోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించే ఛాన్స్ ఉంది.