బాబాయి బాటలో అమ్మాయి, నిహారిక కీలక నిర్ణయం

విజయవాడ చరిత్రలో కనీవినీ ఎరుగని వరదలు ప్రజలకు తీరాన్ని శోకాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. వరద ముంపు ప్రాంతాల్లో ఇంకా వరద పూర్తిగా పోలేదు. దానికి తోడు బురద కూడా భారీగా ఉంటుంది. దీనిని ప్రభుత్వం తొలగించే కార్యక్రమాలు చేపట్టినా వరద భయం మాత్రం ఇంకా అలాగే ఉంది.

  • Written By:
  • Updated On - September 8, 2024 / 02:49 PM IST

విజయవాడ చరిత్రలో కనీవినీ ఎరుగని వరదలు ప్రజలకు తీరాన్ని శోకాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. వరద ముంపు ప్రాంతాల్లో ఇంకా వరద పూర్తిగా పోలేదు. దానికి తోడు బురద కూడా భారీగా ఉంటుంది. దీనిని ప్రభుత్వం తొలగించే కార్యక్రమాలు చేపట్టినా వరద భయం మాత్రం ఇంకా అలాగే ఉంది. నిన్నటి నుంచి భారీ వర్షాలు విజయవాడలో కురవడంతో ప్రజల్లో మళ్ళీ వరద భయం మొదలయింది. తెలంగాణాలో కూడా భారీ వర్షాలు పడటంతో ఎప్పుడు మళ్ళీ వరద తమ ఇళ్ళను తాకుతుందా అని ప్రజలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు.

వరద బాధితుల కష్టాలను చూసిన సినిమా పరిశ్రమ భారీ సాయం చేయడానికి ముందుకు వస్తోంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీనుంచి దాదాపుగా 9 కోట్ల రూపాయల వరద సాయం విజయవాడ వరద బాధితులకు అందింది. పవన్ కళ్యాణ్ ముందు కోటి రూపాయలు విరాళం ప్రకటించినా ఆ తర్వాత మరో 5 కోట్లు పెంచి ఆరు కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. ఇప్పుడు నిహారిక కూడా బాబాయి బాటలో నడిచింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 400 పంచాయితీలకు, పంచాయితీకి లక్ష చొప్పున రూ. 4 కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

నాగబాబు కుమార్తె… నిహారిక కూడా ఇప్పుడు విజయవాడ రూరల్ ఏరియాలో వరద ముంపుకు గురైన ఓ పది గ్రామాలకు ఒక్కో గ్రామానికి ఏభై వేలు చొప్పున ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇటువంటి ప్రకృతి విపత్తులో ఎక్కువగా ఇబ్బందులు పడేది గ్రామీణ ప్రాంత ప్రజలే అని… తాను కూడాఈ బృహత్కార్యంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశ్యంతో ఉడతా భక్తిగా వరద ముంపుకు గురైన ఒక పది గ్రామాలకు ఒక్కో గ్రామానికి గానూ రూ. 50 వేలు చొప్పున 5 లక్షలను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అంటూ నిహారిక పోస్ట్ చేసింది. పవన్ బాటలో నిహారిక ముందుకు రావడం పట్ల అందరూ అభినందిస్తున్నారు.