Global Star: ఎన్టీఆర్ కొరివితో.. తల గోక్కుంటున్నాడా..?

ఎన్టీఆర్ ఇప్పుడు హ్రితిక్ రోషన్ తో వార్ 2 మూవీ చేయబోతున్నాడనే వార్త సంచలనం స్రుష్టిస్తోంది. అంతవరకు బానేఉంది. ఇందులో తనకి జోడీగా ఆలియా కనిపించబోతోంది. అది కూడా ఓకే, కాని ఈ ప్రాజెక్ట్ చేయటం యంగ్ టైగర్ చేజేతులా చేస్తున్న తప్పనే మాట ఒకటి ఇండస్ట్రీలో వినిపిస్తోంది.. ఆ కామెంట్ కి సాలిడ్ రీజన్స్ కూడా ఉన్నాయి.

  • Written By:
  • Updated On - April 10, 2023 / 06:02 PM IST

అసలు వార్ 2 సినిమా తీసేదెవరో తెలిస్తే, ఈ మూవీలో తారక్ నటించటం మొదటి తప్పంటారు. బ్రహ్మస్త్ర లాంటి తక్కువ క్వాలిటీ కథ, కథనం, మేకింగ్ తో షాక్ ఇచ్చిన అయాన్ ముఖర్జీ వార్ 2 తీయబోతున్నాడు.

సరే వార్ 2 కమర్శియల్ గా మంచి కథే దొరికిందనుకుందాం, అలా అయినా తారక్ ఈమూవీ చేయటం కరెక్టేనా అంటేఅక్కడా ఓ డౌట్ అందరినీ ఆలోచనల్లో పడేస్తోంది. అసలే త్రిబుల్ ఆర్ లాంటి మూవీ తారక్ కి మంచి స్నేహితుడైన జక్కన్నే తీస్తే అందులో చెర్రీ పాత్ర బాగుంది, ఎన్టీఆర్ ని తగ్గించారు అన్నారు.

మరి అలాంటిది వార్ 2 లో హ్రితిక్ , ఎన్టీఆర్ పాత్రలు సమానంగా ఉంటాయా? లేదంటే ఎన్టీఆర్ పాత్ర ప్రయారిటీ తగ్గుతుందా? కథ చెప్పినప్పుడు ఒకలా, తీసేప్పుడు ఒకేలా ఉంటుందనటానికి అయాన్ ముకర్జీ ఏమి రాజమౌళి కాదు.. కాబట్టే వార్ 2 మూవీ చేయాలనుకునే తారక్ నిర్ణయం కరెక్ట్ కాదేమో అన్న అనుమానాలు పెరిగాయి.